మెదక్

ఏడుపాయల్లో ఘనంగా బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, అక్టోబర్ 14: ఏడుపాయల్లో బోనాల ఉత్సవం వైభవోపేతంగా, అంగరంగ వైభవంగా జరిగింది. దేవి శరన్నవ దసరా మహోత్సవంలో భాగంగా 5వ రోజైన ఆదివారం మహాలక్ష్మీ అలంకారంలో వనదుర్గాదేవి భక్తజనావళికి దర్శనమిచ్చారు. గోఖుల్ షెడ్‌లోని ఉత్సవ మంటపంలో అమ్మవారిని పెసర రంగు పట్టు వస్త్రంలో అత్యంత సుందరంగా ఆలయ అర్చకులు అలంకరించారు. చండీ ఉపాసకులు, వేద బ్రాహ్మణ పండితులు సనాతనశర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మహాలక్ష్మీ రూపంలో ఉన్న వనదుర్గాదేవికి ప్రత్యేక విశేషాలంకరణ పూజలు నిర్వహించారు. మహాలక్ష్మీ రూపంలో ఉన్న అమ్మవారిని, గర్భాలయంలో కొలువుదీరిన వనదుర్గాదేవిని మాజీ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, తెరాస రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, జోగిని శ్యామలలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోఖుల్ షెడ్ ఉత్సవ మంటపంలో ఆలయ చైర్మన్ జ్యోతి వెలిగించి బోనాల ఉత్సవాన్ని ప్రారంభించారు. బోనాల ఉత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర జోగినుల సంఘం అధ్యక్షురాలు శ్యామల హాజరై బోనం ఎత్తుకొని బోనాల ఉత్సవంలో పాల్గొనగా 121 బోనాలు ఆమెను అనుసరించాయి. భారీ ఉరేగింపుతో బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా గోఖుల్ షెడ్ నుండి వనదుర్గామాత ఆలయం వరకు కొనసాగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, ఈఓ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, ధర్మకర్తలు చర్యలు తీసుకున్నారు.