మెదక్

మెజార్టీలో ముందుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 14 : తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నిచ్చారని...మెజార్టీలో సిద్దిపేట ముందుండాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎన్జీఓ కాలనీ, శివమ్స్ గార్డెన్‌లో ఆటో వర్కర్స్, రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో మైనార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశీర్వాద సభలో మంత్రి హరీష్‌రావు పాల్గొని మాట్లాడారు. ప్రజల అందరి సహకారంతో సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని..అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దుకున్నట్లు పేర్కొన్నారు. మీరు చూపించిన అభిమానమే అభివృద్ధి అన్నారు. సిద్దిపేట నియోజక వర్గం అభివృద్ధిని చూసి ఇతర నియోజక వర్గాలు నేర్చుకుంటున్నాయన్నారు. ఒక కుటుంబ సభ్యునిగా ఉంటున్న..కుటుంబంలో వ్యక్తిగా మీ అవసరాలు తీర్చుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో సిద్దిపేట ప్రాంతం గోదావరి నీటితో సస్యశ్యామలంగా మారుతుందన్నారు. రెండేళ్లలో సిద్దిపేటలో రైలు కూత పెట్టనున్నట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చూసి సీడబ్లుసీ అభినందించారన్నారు. ఈలాంటి ప్రాజెక్టును మా అనుభవంలో చూడలేదని కితాబునిచ్చారన్నారు. వచ్చే వానకాలం వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి చెరువు, కుంటలను నీటితో నింపుతానని భరోసా ఇచ్చారు. మెడిగడ్డ వద్ద 390 మీటర్ల ఎత్తు నుండి గోదావరి ఎత్తిపోస్తామన్నారు. సిద్దిపేటకు రెండు జాతీయ రహదారులు రాబోతున్నట్లు తెలిపారు. సిద్దిపేట ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. వైద్య కళాశాల పనులు వేగవంతంగా సాగుతున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 60 శాతం పూర్తయినట్లు తెలిపారు. ఆరునెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట అభివృద్ది ఇక్కడి ప్రజల సహాకారం, ఆశీస్సులతోనే జరిగిందన్నారు. అభివృద్ధిలో మీ భాగస్వామ్యం మరువలేనిదని కొనియాడారు. సిద్దిపేట నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రతి సారి గౌరవాన్ని మరింత పెంచేలా కృషిచేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 200 మైనార్టీ రెసిడెన్సియల్ స్కూళ్లు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ముస్లీంలకు వైకుంఠరథం, ఆఖరి సఫర్ సిద్దిపేట నుండి ప్రారంభమైందన్నారు. పేద ముస్లీంల ఆర్థికాభివృద్ధికి 800 కుట్టుమిషన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఆటోకార్మికులు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ర్యాలీ
సిద్దిపేటలో టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా ఆటోకార్మికలు ఆటోలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆనంతరం శివమ్స్ గార్డెన్‌లో నిర్వహించిన మద్దతు సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఆటోవాల అభిమానం ఏంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. మీరు ఇచ్చే అభిమానం మరువలేనిదన్నారు. రాబోయే రోజుల్లో ఆటో కార్మికులకు అన్ని రకాల సహాయ, సహకారం అందించేందుకు కృషిచేస్తానన్నారు. ఆటోకార్మికులకు సమస్యల పరిష్కారానికి మెనీపెస్టోలో పెట్టె విధంగా కృషిచేస్తానన్నారు. ఆటో కార్మికులు వ్యక్తులు కాదని, శక్తులని కొనియాడారు. ఆటో కార్మికులకు ప్రభుత్వ పథకాల్లో న్యాయమైన వాటా వచ్చే విధంగా కృషిచేస్తానన్నారు. రెక్కాడితో డొక్కాడని పరిస్థితి మీదయిన నాకోసం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. అందరి సహాకారంతో సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి తీర్చిదిద్దినట్లు తెలిపారు. కోమటిచెరువును అభివృద్ధిని చేసి ఆహ్లదకరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. మీకు అన్నింటా తోడుగా ఉండి మరింత సేవా చేస్తానన్నారు. ఆనంతరం మంత్రి హరీష్‌రావును ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, పట్టణ అధ్యక్షుడు నయ్యర్‌పటేల్, గౌస్‌మోహినోద్దీన్, నాయకులు మల్లికార్జున్, ఆనంద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.