మెదక్

కేసీఆర్ ఓటమితోనే ప్రజారంజక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, అక్టోబర్ 14: టీఆర్‌ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ ఓటమితోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాధ్యమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంత రావు అన్నారు. బంగారు తెలంగాణ పేరిట ప్రజలను మరోసారి మోసగించడానికి తొమ్మిది నెలల ముందే ముందస్తు ఎన్నికలకు సిద్ధమయిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వి. హనుమంతరావు అధ్వర్యంలో చేపట్టిన ఇందిరా విజయ రథయాత్ర ఆదివారం పటన్‌చెరు పట్టణానికి చేరింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం హనుమంత రావు మాట్లాడుతూ రానున్న శాసనసభ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం పలికారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి అని ఈ ప్రాంత ప్రజలకు తెలుసు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది బలిదానాలు చూసి చలించిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి అంగీకరించిందన్నారు. ఇప్పటికి ప్రజలు వాస్తవాలు గుర్తెరగారని ఈసారి కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరిగా పట్టం కడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బాగుపడింది కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే అన్నారు. కార్మికులు, గ్రామీణ ప్రజలు, ఉద్యోగులు నియంత లాంటి కేసీఆర్ పాలనలో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు. ఇందిరా విజయ రధయాత్ర పేరిట పర్యటనను ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ప్రారంభించామని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఆనందం వెలుబుచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్‌యాదవ్, పార్టీ రాష్ట్ర మహళా కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా సర్పంచుల పోరం మాజీ జిల్లా అధ్యక్షులు కాట శ్రీనివాస్‌గౌడ్, గోక శశికళయాదవరెడ్డి, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.