మెదక్

మాటలతో మభ్య పెట్టడం కేసీఆర్‌కు అలవాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డిటౌన్, అక్టోబర్ 14: మాయ మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడమే కేసీఆర్ అలవాటుగా పెట్టుకున్నారని, ముఖ్యమంత్రి అంటే సచివాలయం వెళ్లి పాలన సాగించాలని, కానీ కేసీఆర్ అందుకు విరుద్ధంగా నాలుగున్నరేళ్లు వ్యవహరించారని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి సదానందగౌడ విమర్శించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ సమరభేరి బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ హామీలేవి నెరవేర్చలేదన్నారు. దేశం మొత్తం జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో మూడు నెలలుగా అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇలా ఎన్నికలు పూర్తయిన వెనువెంటనే ఐదు నెలల్లోనే పార్లమెంటు ఎన్నికలు వస్తాయని, మళ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందన్నారు. చెప్పిన హామిలన్ని అమలు చేస్తూ యావత్ దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడి ఆకర్షిస్తున్నారన్నారు. భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం పట్టులేని ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నట్లుగా 8.5 శాతం జీడీపీ సాధించడం మోదీ పాలన దక్షతకు అద్దం పడుతుందని చెప్పారు. త్రిపుర లాంటి చిన్న రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే ప్రధాని మోడి సుపరిపాలనే అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసేందుకు వెళితే అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. కొడుకు, కూతురుతో పాటు అక్బరోద్దీన్, అసదోద్దీన్‌లకు మాత్రమే అనుమతిస్తారని ఎద్దేవా చేసారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాలేదని, నిర్ధిష్ట సమయానికి ఎన్నికలకు వెళితే ప్రజలు నిలదీస్తారన్న భయంతో సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుందని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఆకాక్షింస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పి.బాబుమోహన్ మాట్లాడుతూ కేసీఆర్ దళితులను మోసం చేస్తే, బీజేపీ దళితుడిని రాష్టప్రతిని చేసిందన్నారు. నాలుక కోసుకుంటాను, తల నరుక్కుంటాను అని కేసీఆర్ ఏదైనా హామి ఇస్తే అది పక్కా అబద్ధమని నిర్ణయించుకోవాలని తెలిపారు. కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ఉద్దేశంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని ధ్వజమెత్తారు. తొమ్మిది నెలల సమయం ఉండగా ఏ మంత్రి, ఎమ్మెల్యే అడగకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తానే ఆ కుర్చీలో కూర్చున్న తెలివైన మోసకారి కేసీఆర్ అని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు, బీసీలు ఎక్కువ శాతం ఉన్నారని అన్ని వర్గాలకు సమప్రాధాన్యతను ఇస్తూ ప్రధాని మోడి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళుతున్నాడని సంతోషం వ్యక్తం చేశాడు. కేసీఆర్ రాష్ట్రం అభివృద్ధి పేరిట 2.5 లక్షల అప్పు చేస్తే దేశం కోసం ప్రధాని పైసా అప్పు చేయలేదని, అప్పు చేయని ఏకైక ప్రధాని ఎవరంటే మోదీయే అన్నారు. కొడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కోసం సింగూర్ నీటిని తీసుకువెళ్లి ఈ ప్రాంత ప్రజలను దగా చేసిన కేసీఆర్‌కు ముందస్తు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, జగన్, చంద్రశేఖర్, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గణేష్ గడ్డా నుంచి సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి సదానందగౌడ సమక్షంలో కొండాపూర్ ఎంపీపీ మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే బీజేపీలో చేరారు.