మెదక్

సద్దుల బతుకమ్మకు కోమటిచెరువు ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 16: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగ కోసం సిద్దిపేటలో కోమటిచెరువు సర్వాంగా సుందరంగా ముస్తాబుచేశారు. కోమటిచెరువు కట్టపై రంగు, రంగులతో ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించారు. కోమటిచెరువు కట్టపై బతుకమ్మ ఫ్లాట్ ఫాం, బతుకమ్మ విగ్రహాలను, రాష్ట్ర జంతువు జింక విగ్రహాలనలు రంగు, రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. సిద్దిపేట పురపాలక సంఘం కోమటిచెరువు ప్రాంగణ మంత పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. కోమటిచెరువు ప్రాంగణ మంత విద్యుత్ దీపాలతో అలంకరించారు. చెరువుకు వచ్చే దారులను రోడ్లను గుంతలను పూడ్చి వేసి మరమ్మతు చర్యలు చేపట్టారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు జరుపుకునే సద్దుల బతుకమ్మను ఈ ప్రాంతంలో ఘనంగా జరుపుకుంటారు. ఇందుకోసం పట్టణంలోని కోమటిచెరువు వద్ద బారికేడ్ల నిర్మాణం, 50 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. చెరువు వద్ద మున్సిపల్ పక్షాన రెండు స్టేజిలు ఏర్పాటు చేయనున్నారు. ఒక స్టేజి సంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పండుగ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిలు అధికారులతో కలసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. చెరువు ప్రాంతంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీపీ జోయల్ డేవిస్ పర్యవేక్షణలో బందోబస్తు చేస్తున్నారు.

అభివృద్ధిని చూసి ఓటు వేయాలి
* మాజీ ఎమ్మెల్యే రాంలింగారెడ్డి
మిరుదొడ్డి, అక్టోబర్ 16: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పితే దోపిడీ పాలనలోకి వెళ్లడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే సోలిపేట రాంలింగారెడ్డి అన్నారు. మండల పరిధిలోని మోతె గ్రామంలో మంగళవారంనాడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల ప్రజాభిప్రాయ పాలన టీఆర్‌ఎస్‌ది అన్నారు. జన బలం ముందు ఉప్పెనల కోట్టుకు పోతారని జోస్యం చెప్పారు. మహాకూటమి నాయకులకు ప్రజలు సరైన బుద్ధి చేపుతారని, గ్రామాలలో ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీనాయకులను నిలదీయలన్నారు. మహాకూటమి కాదు కాలకూటమన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కనుమరుగు కావడం ఖాయమన్నారు. పార్టీలో వున్న ప్రతి ఒక్కరికి అండగా వుంటానని పెర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు వంజరి శ్రీనివాస్, బోరంరాజేశ్వర్, కటికె శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధికి ఆకర్షితులై తెరాస తీర్థం
* కారు స్పీడ్ పెంచి భారీ మేజార్టీతో గెలిపిస్తాం
* పీఆర్ పల్లి మాజీ సర్పంచ్, డాక్టర్ రాజుగౌడ్
* మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక
సంగారెడ్డి టౌన్, అక్టోబర్ 16: తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్ష్నితులై టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన పోతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సుమంగళి చంద్రశేఖర్, డాక్టర్ రాజుగౌడ్‌లు పేర్కొన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి హరీష్‌రావుసమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సుమంగళి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తుపెట్టుకుందని విమర్శించారు. డాక్టర్ రాజుగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య వృత్తికి రిజైన్ చేసి ప్రజాసేవకై రాజకీయాల్లోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. తెరాస హయంలోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందిందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను భారీ మేజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు ఆర్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నర్సింలు, నాయకులు పట్నం మానిక్యం, జలేందర్‌రావు, ప్రదీప్, వెంకటేశం పాల్గొన్నారు.

ట్రాఫిక్ విభాగంలో ఈ చాలన్ విధానం ప్రారంభం
* ట్రాఫీక్ ఏసీపీ బాలాజీ
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 16: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విభాగంలో నిర్వర్తించే విధుల పట్ల ప్రజలకు మరింత పారదర్శకత కల్పించడం కోసం నూతనంగా ఈ చాలన్ విధానాన్ని మంగళవారం నుండి ప్రారంభించినట్లు ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంచడం, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల పట్ల ఉండాల్సిన బాధ్యతలను తెలిపేందుకు హైద్రాబాద్ తరహాలో ట్రాఫిక్ నిబంధనలు అమలు చేసి ఈ చాలన్ ద్వారా జరిమానాలు విధించనున్నట్లు వెల్లడించారు. వాహనదారులు నిబంధనలు అతిక్రమించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అతిక్రమించిన వారికి ఇకపై ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. నగరంలో వివిధ ట్రాఫిక్ జంక్షన్లలో విధులు నిర్వహించే ట్రాఫిక్ అధికారులు వాహనాలను గుర్తించి ఫోటోలు తీసి వాహనదారునికి ఏ విధమైన ట్రాఫిక్ ఉల్లంఘన జరిగిందో ఆన్‌లైన్‌లో నమోదు చేసి సదరు వాహనదారునికి జరిమానా పంపించాలన్నారు.