మెదక్

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, అక్టోబర్ 16: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సమస్య వచ్చాక పరిష్కరించడం కంటే,సమస్య ఎదురుకాక ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవడం మేలని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతి భద్రలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ అధికారుల విధులు, అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, నిబంధనలు తదితర వాటిపై వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి గొడవలు, సమస్యలు తలెత్తినప్పుడు ఫోటోలు, వీడియోలు తీయించాలని, తద్వారా నిందితులను సులువుగా గుర్తించడమే కాకుండా గొడవలు జరగకుండ నివారించవచ్చని తెలిపారు. గతంలో ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులలో నిందితులు బైండోవర్ చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో అక్రమ మద్యం చెలామనీని నిరోధించడం ద్వారా చాల వరకు గొడవలకు అడ్డుకట్ట వేయవచ్చని, ఇందులో భాగంగా కర్నాటక నుండి మద్యం అక్రమ రవాణాను నివారించేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రయ్య మాట్లాడుతూ అక్రమ మద్యం ఏ విధంగా నిరోధించాలనే అంశంపై పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సమావేశంలో ఎఎస్పీ మహేందర్, డీఎస్పీలు శ్రీ్ధర్‌రెడ్డి, నల్లమల రవి, సత్యనారాయణ, రాజేశ్వర్‌రావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

బతుకమ్మ పండుగ మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలి
* కలెక్టర్ హన్మంతరావు
సంగారెడ్డి టౌన్, అక్టోబర్ 16: మహిళల ప్రత్యేక పండుగైన బతుకమ్మ వారి జీవితాలలో వెలుగులు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎం.హన్మంతరావు ఆకాంక్షించారు. బతుకమ్మ సంబురాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం సమీకృత కలెక్టరేట్ ఆవరణలో ముగింపు సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ మహిళలకే కాకుండా అందరి పండగని, పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొని ఆట పాటలతో ఆడటం ఆనందదాయకమన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. మహిళ ఉద్యోగులు, అధికారులే కాకుండా పట్టణ ప్రజలు సంబురాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ ఆట పాటలతో గౌరిదేవికి పూజలు చేసి ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం చాల ఆనందంగా ఉందన్నారు. అందరికి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ సతీమణి శ్రవంతి మాట్లాడుతూ బతుకమ్మ ఏ విధంగా ఉద్బవించిందన్నదానికి గల కథను వివరించారు. పూలతో ఏర్పడిన బతుకమ్మను అమ్మవారిగా తలచి మహిళలందరూ తమ ఆట పాటలతో పూజిస్తారని తెలిపారు. బతుకమ్మ అంటేనే మహిళల ప్రత్యేక పండుగగా చెప్పవచ్చన్నారు. సంగారెడ్డి ప్రజలందరికి పండగ శుభాకాంక్షలు తెలిపారు. సత్యసాయి అకాడమి విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఆయా శాఖల ఉద్యోగినులు రంగు రంగు పూలలతో పేర్చిన బతుకమ్మలను ఒక వద్దకు చేర్చి ఆడి పాడారు. తెలంగాణ వంటలకు సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేసారు. సంబురాల్లో జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగినీలు స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

ఘనంగా అమ్మవారి బోనాలు
కొల్చారం, అక్టోబర్ 16: మండలంలోని రంగంపేట, అంసాన్‌పల్లి గ్రామంలో మంగళవారం దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవార్లకు గ్రామస్తులు భారీయేత్తున బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ప్రముఖ వ్యాపార కేంద్రమైన రంగంపేటలో హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా పోతరాజులు, శివసత్తులను తీసుకువచ్చి బోనమెత్తారు. గ్రామంలో పుర వీదుల గుండా మంగళవాయిద్యాలు, డప్పుచప్పళ్ల నడుమ బోనాల ఉరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది. హైదరాబాద్ నుండి వచ్చిన పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనాకాలు ప్రత్యేకంగా ప్రజలను ఆకర్శించింది. అంసాన్‌పల్లిలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించగా మహిళలు భారీయేత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు రమేశ్‌కుమార్, పీఎసీఎస్ చైర్మన్ మల్లేశం, ఎంపీపీ రజిని, ఎంపీటీసీ నారాయణ, గ్రామస్తులు భారీయేత్తున పాల్గొన్నారు.