మెదక్

పార్టీ టికెట్ల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, అక్టోబర్ 16: పార్టీ టికెట్ల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగకూడదని సర్వేలో గెలిచే అభ్యర్థులకే పార్టీ టికెట్ ఇస్తుందని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు తెలిపారు. మంగళవారం మెదక్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైరవీలు చేయవద్దు, ఎంపిక చేసిన అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు ప్రచారాలు ముమ్మరం చేయాలని ఆదేశించిన విషయాన్ని ఆయన తెలిపారు. ఈ నెల 20న రాహుల్‌గాంధీ కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభకు కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుండి రెండు లక్షల మంది కార్యకర్తలతో సభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. 20న సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ సభ ప్రారంభం అవుతుందన్నారు. మెదక్ జిల్లా నుండి 50 వేల మందిని తరలిస్తున్నట్లు మామిళ్ల ఆంజనేయులు తెలిపారు. మాజీ మంత్రి సునీతారెడ్డి నాయకత్వంలో జిల్లా నుండి కార్యకర్తలను రాహుల్‌గాంధీ సభకు తరలిస్తున్నట్లు తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, టీ పీసీసీ కార్యదర్శి బట్టి జగపతి నాయకత్వంలో కార్యకర్తలను భారీగా తరలిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రణాళికలో రూపొందించిన అంశాలను వెల్లడించబోతున్నట్లు ఆయన తెలిపారు. పాలనలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరచిన తెరాసకు సరైన గుణపాఠం చెప్పాలని ఆంజనేయులు ప్రజలకు పిలుపునిచ్చారు. పేదల సంక్షేమం మరచి ఈ ప్రభుత్వం ధనవంతుల కొమ్ముకాచిందన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో రెండు లక్షల 25 వేల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందని, ఈ అప్పులు ప్రతి కుటుంబంపై 50 వేలు విధించినట్లు తెలిపారు. ముస్లింలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. కాగా రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ కుటుంభంలో తెలంగాణ కోసం ఎలాంటి ప్రాణత్యాగం చేయలేదని, నెహ్రూ కుటుంబంలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ బలిదానం అయ్యారని ఆయన తెలిపారు. అందువలన ఈ దేశం కోసం త్యాగం చేసిన ఆ కుటుంబాన్ని దీవించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు, మేకల ఆంజనేయులు, పేరూర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

అధికారం కోసం కాంగ్రెస్ పాకులాట
ఉనికి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఆరాటం
అభివృద్ధి చేసిన కేసీఆర్‌ను విమర్శిస్తే పుట్టగతులుండవు
ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి

గజ్వేల్, అక్టోబర్ 16: అధికారం కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ ఆటలు ఎంతమాత్రం సాగనివ్వబోమని ఎమ్మెల్సీ పాతూరి సుదాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. తెలంగాణాలో కనుమరుగైన టీడీపీ ఉనికి కోసం చంద్రబాబు ఆరాటపడుతుండగా, సమైఖ్యవాదులకు ఇక రాష్ట్రంలో చెల్లుచీటేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా సమైఖ్యవాదుల పాలనలో తెలంగాణ ప్రాంతం బక్కచిక్కిపోగా, అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైనట్లు తెలిపారు. స్వరాష్ట్రం, స్వపరిపాలన కోసం సీఎం కేసీఆర్‌తోపాటు సకలజనులు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాదించుకోగా, తెలంగాణాపై పెత్తనం చెలాయించేందుకు అమరావతి, డిల్లీ పాలకులు కుట్రలకు తెరలేపుతున్నట్లు చెప్పారు. అయితే వారికి అండగా కోదండరాం నిలువగా, ఒకటిరెండు అసెంబ్లీ సీట్ల కోసం ఎక్కిన గడప ఎక్కకుండా తిరుగుతుండడం సిగ్గుచేటని నిలదీశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడిపిన సీఎం కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలవనుండగా, గజ్వేల్‌ను సర్వతోముఖాభివృద్ధి చేసి సమస్యలు లేకుండా చూస్తున్న కేసీఆర్ తిరిగి మరోసారి అండగా నిలిచి ఆదరించాలని కోరారు. అమలుకు సాద్యంకాని హామీలు గుప్పిస్తూ ప్రతిపక్ష పార్టీలు మెనిఫెస్టో రూపకల్పన చేస్తుండగా ఇక్కడి ప్రజలను మభ్య పెట్టేందుకే కుట్రలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ సొసైటీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, పీఏసీఎస్ చైర్మెన్ వెంకట్‌నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షులు బెండ మధు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ యాదవరెడ్డి, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షులు గోపాల్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు రజిత, కౌన్సిలర్‌లు రామదాసు, నర్సింలు, సంతోషిని రాంచంద్రాచారి, నీరుడి మల్లమ్మ ఇస్తారి, జకియొద్దీన్, కళ్యాన్‌కర్ స్రవంతి శ్రీనివాస్, నేతలు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, ఆకుల దేవేందర్, ఊడెం కృష్ణారెడ్డి, గంటా శంకరయ్య, మద్ది రాజిరెడ్డి, నిమ్మ రమేశ్, సురేశ్, మల్లేషం, రమేశ్ గౌడ్, శ్రీవర్దన్, బొగ్గుల చందు, ప్రవీన్, స్వామి తదితరులు పాల్గొన్నారు.