మెదక్

ఆస్తిపన్ను పెంపును నిరసిస్తూ బిజెపి ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబ్బాక, మే 13: దుబ్బాక నగర పంచాయతిలో ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే పన్నుల పెంపుతో ప్రజలను వేధించడమేనన్నారు. ప్రభుత్వం వెంటనే పెంచిన ఆస్తి పన్నును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. దుబ్బాక నగర పంచాయతిగా అధికారికంగా ప్రకటించకముందే ఆస్తి పన్నును పెంచడం ధారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే బిజెపి ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బిజెపి నేతలు వడ్ల రాజు, భూపతి, బాలేశ్‌గౌడ్, వంశీకృష్ణ, చిన్నకృష్ణగౌడ్, రాజశేఖర్, రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.