క్రైమ్/లీగల్

ఆగిన లారీని ఢీకొన్న కారు.. భార్యాభర్తలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాదుర్గం, నవంబర్ 8: తాత ఆస్తికలను గోధావరి నదిలో కలిపి నాందేడ్ నుండి హైదరాబాద్ వస్తుండగా అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దపూర్ హైవే రహదారిపై నిలిపి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందారు. మహారాష్టల్రోని ఔరంగబాద్ జిల్లాకు చెందిన ఉస్మాన్‌పూర్ ప్రాంతానికి చెందిన సుకిందర్‌సింగ్(50) భార్య జస్మీర్ కౌర్(45)లు మృతి చెందగా వీరి కూతురు అర్‌జిందర్ కౌర్, బావమరుదులు జవహార్‌సింగ్, దయాసింగ్, వీరి బంధువు భూపేందర్‌సింగ్, కుమారుడు రాజ్‌పాల్ సింగ్ కలిసి గురువారం వారి తాత ఆస్తికలను గోదావరి నదిలో కలిపి నాందేడ్ నుండి ఎపీ 11 కె 1208 నంబర్ గల కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా గడిపెద్దాపూర్ శివారులోని ఇండియాన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే వాహనం నడుపుతున్న సుకుబీర్‌సింగ్ అతి వేదంగా నడుపుతూ కుడివైపు రాంగ్ రూట్‌లో వెళ్లి టిజి 04 జేడీ 1997 గల లారీనీ ఢీకొట్టగా జస్మీర్ కౌర్ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వీరిని చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో సుకిందర్‌సింగ్, మరో ముగ్గురి పరిస్థితి ఆందోళకరంగా ఉండటంతో జోగిపేట నుండి సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సుకిందర్‌సింగ్ మృతి చెందారు. మృతుల కుమారుడు రాజ్‌పాల్‌సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అల్లాదుర్గం ఎస్సై మమ్మద్ గౌస్ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
గజ్వేల్, నవంబర్ 8: వర్గల్ మండల పరిదిలోని నాచారం శివారులో ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బాదితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బూస రాములు(46) బుధవారం రాత్రి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లగా గురువారం తెల్లవారుజామున శివారులోని హల్దీవాగు పక్కన శవమై కనిపించాడు. దీంతో మృతుడి భార్య మణెమ్మ ఫిర్యాదు మేరకు గౌరారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుడు రాములు మెడకు టవల్ చుట్టి తలపై బండరాయితో బాధినట్లు తెలుస్తుండగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు. అయితే మృతుని సంబందీకులు పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తుండగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.