మెదక్

భక్తులతో ఏడుపాయల కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, మే 15: తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ది చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావాని అమ్మవారి ఆలయానికి ఆదివారం రోజు భక్తజనం వెల్లువెత్తింది. ఆలయ ప్రాంగణంలోని షవర్ బాత్‌లు, చెక్ డ్యామ్‌లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని ఆలయ పూజారులు పట్టువస్త్రంలో అత్యంత సుందరంగా వివిధ రకాల పూలతో అలంకరించారు. ఆలయ గర్భాలయంలో అమ్మవారు కోటి సూర్యప్రభ కాంతులతో దగదగలాడుతూ భక్తులకు దర్శనమిచ్చింది. చెట్లు, రాళ్లగుట్టలతో ఉండే అటవి ప్రాంతమంతా జనసంద్రమైంది. డప్పు వాయిద్యాల మోతలు...బోనాల ఉరేగింపులు...శివసత్తుల శిగాలు...పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల ప్రాంగణమంతా హోరెత్తింది. అడుగడున తెలంగాణ జానపదులు సాంస్కృతి అవికృతమైంది. తెలంగాణలోని జిల్లాలు, హైదరాబాద్ జంట నగరాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి భక్తులు వెల్లువల తరలివచ్చారు. లక్షలాది భక్తులు తరలిరావడంతో విశాలమైన ఏడుపాయల ప్రాంగణం ఎటు చూసిన జనసంద్రమే కనిపించింది. రద్దీ విపరీతంగా ఉండటం, బోనాల ఉరేగింపు నిర్వహించడంతో దుర్గామాత ఆలయానికి వెళ్లెదారి ఉదయం నుండి రాత్రి వరకు కిటకిటలాడింది. భక్తులు కాలికి గజ్జెలు కట్టి, జుట్టు విరబోసుకొని, నెత్తిపై బోనం ఆపై గండదీపం పెట్టుకొని, ముఖానికి పసుపు వ్రాసుకొని, వేపకొమ్మలు చేతబూని, మెడలో గవ్వలహారాలు, పూలదండలు వేసుకొని, చేతిలొ కొరడా పట్టుకొని డప్పుల దరువులకు అనుగుణంగా, లయబద్దంగా నృత్యాలు చేస్తూ ఉరేగింపులుగా వనదుర్గామాత ఆలయం వైపు సాగిపోతున్న దృశ్యాలు, పోతరాజుల నృత్యాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించారు. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటంతో వనదుర్గామాత దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. మొక్కుబడుల్లో భాగంగా అనేక మంది భక్తులు దుర్గామాతకు చీర, రవిక, గాజులు సమర్పించి ఒడిబియ్యం పోశారు. కొందరు భక్తులు తలనీలాలు ఇచ్చారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి గొర్రెలు, మేకలు, కోళ్లను బలిచి తమ తమ మొక్కులను తీర్చుకున్నారు. అమ్మవారి కృపతో సంతానం కలగాలని సంతాన గుండంలో దంపతులు స్నానాలు ఆచరించి అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయలను, తొట్టెల్లను కట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు, ఆలయ సిబ్బంది చల్లా గోపాల్, జెన్న రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, సూర్య శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మలు భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు. ఎస్సై సందీప్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.