మెదక్

నిర్వాసితులకు న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మే 16: నిమ్జ్‌లో ప్రభుత్వం బలవంతంగా రైతుల నుండి భూములు తీసుకోరాదని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే రైతుల నుండి భూములు సేకరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు డిమాండ్ చేశారు. నిమ్జ్ భూ బాధితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్వో దయానంద్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి చుక్క రాములు మాట్లాడుతూ న్యాల్‌కల్ మండలంలో 14, ఝరాసంగం మండలంలో 3 గ్రామాల్లో 12,635,14 ఎకరాల భూములను నిమ్జ్ పేరుతో సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సారవంతమైన నల్లరేగడి, ఎర్రనేల ఈ భూములలో రైతాంగం వివిధ పంటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, బహుళ పంటలు పండే భూములను పరిశ్రమల పేరుతో తీసుకోవడం సమంజసం కాదన్నారు. రైతుల ఆమోదం లేకుండా బలవంతంగా భూసేకరణ చేయకూడదని డిమాండ్ చేశారు. ఈ భూములకు మార్కెట్ రేట్‌తో పోలిస్తే చాల తక్కువగా చెల్లిస్తున్నారని, ప్రస్తుతం గ్రామాల్లో ఎకరానికి రూ.15లక్షలు, రోడ్డు పక్కన ఉన్నవాటికి 20 నుండి 30లక్షల వరకు భూమి విలువ ఉందన్నారు. మార్కెట్ రేటుకు అదనంగా నాలుగు రేట్లు ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమిపై ఆధారపడి జీవించే వారందరికీ నెలకు రూ.2వేల చొప్పున 20యేళ్లు చెల్లించాలని, కుటుంబంలో ఒకరి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టంలో ఉన్న సౌకర్యాలన్ని కల్పించాలన్నారు. భూనిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. ధర్నాలో కమిటీ అధ్యక్షులు రాంచందర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజయ్య, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మానిక్యం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సాయిలు, సిపిఎం నాయకులు యాదవరెడ్డి, మహిపాల్, భూ బాధితులు శ్రీనివాస్‌రెడ్డి, రాజిరెడ్డి, గణపతి, మోహన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అంజిరెడ్డి, శంకర్, సంగప్ప, సంజీవ్‌రెడ్డి, గోపాల్, సిద్దన్న, వీరన్న తదితరులు పాల్గొన్నారు.