మెదక్

హరిత సిద్దిపేటగా మార్చేందుకు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 2 : సిద్దిపేటను హరిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని మున్సిపల్ కమిషనర్ కెవి.రమణాచారి అన్నారు. శనివారం పట్టంలోని సిద్దిపేట-హైదరబాద్, కరీంనగర్, మెదక్ ప్రధాన రోడ్లపై వున్న డివైడర్లపై కమిషనర్ హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి, ట్రీగార్డులు అమర్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు చేపట్టారు. చెట్లను విరివిగా పెంచటంతో అందంగా తీర్చిదిద్దారన్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్లపై పెరిగిన చెట్లు పట్టణానికి కొత్త శోభను తీసుకువస్తున్నాయన్నారు. అలాగే పట్టణంలోని మిగతా ప్రాంతాల్లో చెట్లు విరివిగా పెంచాలన్నారు. పట్టణ ప్రధాన వీధుల్లో సైతం విరివిగా మొక్కలు నాటడంతో పాటు వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు.
చెట్లు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయన్నారు. రోడ్లకు వెళ్తున్నప్పుడు ట్రీగార్డులు పడిపోయనా వాటిని సరిచేయటం మన బాధ్యతగా భావించాలన్నారు. మన పట్టణాన్ని మనమే అందంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, నర్సాపూర్ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపుల పిచ్చిమొక్కలను తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. ఈకార్యక్రమంలో టిపిఓ రాంరెడ్డి, టిపిఎస్ ప్రభాకర్, టిపిబిఓ విజయలక్ష్మి, ప్రసన్నకుమార్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.