మెదక్

కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 9 : సిద్దిపేట జిల్లా పరిధిలోని నాలుగు నియోజక వర్గాలు సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ నియోజక వర్గాల్లో ఈవీఎంలను పొన్నాల ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలకు తరలించి స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చారు. పొన్నాల ఇందూర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను పటిష్టపర్చినట్లు పోలీస్ కమిషనర్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లును సీపీ పరిశీలించారు. కేంద్రబలగాలతో పటిష్టబందోబస్తు 24 గంటల పాటు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి రోజు రాత్రిబవళ్లు పోలీసు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. కౌంటింగ్ సందర్భంగా నాలుగు నియోజక వర్గాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ కొం ముగ్గురు అడీషననల్ డీసీపీలు, 6 డీఎస్పీలు, 13 మంది సీఐలు, 27 మంది ఎస్‌ఐలు 230 మందితో కేంద్ర పారా మిలిటరి బెటాలియన్ కంపెనీ బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. బ్లూకోడ్స్, పెట్రోలింగ్ పార్టీలు,స్ట్రైకింగ్ ఫోర్స్‌లతో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి అంచలో వాహనాల తనికీ ఉంటుందని, పాస్‌లున్నవారికి అనుమతి ఉంటుందన్నారు. రెండవ అంచలో కౌంటింగ్ కేంద్రం చుట్టు బ్యారికేడ్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే భద్రత బలగాలు నీఘా ఉంటుందన్నారు. మూడవ అంచెలో సీసీ కెమెరాలు, కేంద్ర బలగాలు, పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్ గూర్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పూర్తి నిఘా నీడలో కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. కౌంటింగ్ తేదీన ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ప్రజలు,ప్రజానిధులు ఇంకుదుకు సహాకరించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు, పాస్ హోల్డర్స్ మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కౌంటింగ్ ఏజేంట్లకు ఉదయం 7గంటల లోపు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్ పాసులు ఉన్నవారికి మాత్రమే లోనికి అనుమతి ఇస్తామన్నారు. ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండ గట్టి బందోభద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు సూచనలు,సలహాలు పాటించి, ప్రజలు ప్రజాప్రతినిధులు సహాకరించాలన్నారు. ఈకార్యక్రమంలో అడీషనల్ డీసీపీ నర్సింహరెడ్డి, ఏసీపీ రామేశ్వర్, రూరల్ సీఐ వెంకట్రామయ్య, ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.