మెదక్

గజ్వేల్‌లో గెలుపెవరిదో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, డిసెంబర్ 9: గజ్వేల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచార కార్యక్రమాన్ని ఉద్ధృతంగా నిర్వహించాయి. అయితే పోలింగ్ ఊహించని స్థాయికి చేరడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా, అభ్యర్థుల్లో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. అభివృద్ధికి అండగా నిలిచిన ఓటర్లు పోలింగ్‌స్టేషన్‌లకు చేరుకొని ఓట్లు వేయగా, తమకే లాభిస్తుందని టీఆర్‌ఎస్ భావిస్తోంది. అయితే టీఆర్‌ఎస్ హయాంలో అన్యాయానికి గురైన దళితులు, గీతకార్మికులు, గంగపుత్రులు, వ్యాపారులు, భూములు కోల్పోయిన నిర్వాసితులు, ఉద్యోగులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఓట్లు వేయడంతో ఫలితం తమకు అనుకూలంగా రానుందని కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేస్తోంది. కాగా గత 2014 అసెంబ్లీ ఎన్నికల సమయం లో 68 శాతానికే పరిమితమైన పోలింగ్ ఫలితంగా 20 వేల లోపు మెజార్టీతో కేసీఆర్ గెలుపొందగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 87 శాతం ఓట్లు పడడంతో ఎలాగైనా గట్టెక్కనున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే పావులు కదిపిన గ్రామాల్లో నాయకత్వ లోపం కొట్టొచ్చినప్పటికీ పార్టీ శ్రేణులు కష్టపడడం తనకు కలిసివచ్చే అంశం కాగా, చివరి క్షణంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని పార్టీలో చేరడం ప్లస్ పాయింట్‌గా ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ పడకముందే టీఆర్‌ఎస్ అభ్యర్థి కేసీఆర్‌కు మద్దతుగా మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ కుల సంఘాల సమావేశాలు, వివిధ వర్గాల ఆత్మీయ సభలు నిర్వహించడంతోపాటు ప్రతి మండలానికి ఇన్‌చార్జీ లను నియమించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్ సర్కార్ అమలు చేసిన రైతుబంధు, రైతుభీమా, తాగునీరు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు ఓట్ల వర్షం కురిపిస్తాయని టీఆర్‌ఎస్ భావిస్తోంది. అలాగే గజ్వేల్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో ప్రజల నుండి మంచి స్పందన రాగా, అభివృద్ధిని చూసి కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున చేరుకున్నట్లు మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ స్పష్టం చేశారు. ఈ నెల 7న ఓటింగ్ ప్రక్రియ ముగియగా, అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లోకి చేరుకొని 11న జరగనున్న ఓట్ల లెక్కింపులో అసలు విషయం తేలనుంది.
కోర్టును ఆశ్రయించిన వంటేరు ప్రతాప్‌రెడ్డి
అధికార పక్షం వత్తడితో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని, అయితే వీవీప్యాట్‌లను లెక్కిస్తే అసలు విషయం తేలుతుందని పేర్కొంటూ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి కోర్టుకెక్కినట్లు తెలిసింది. ఓట్ల లెక్కింపుకు సమయం దగ్గర పడడంతో కోర్టు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుందా? లేదా అనే విషయంపై సందిగ్దత నెలకొంది.