మెదక్

ఉత్కంఠంగా సాగిన సంగారెడ్డి కౌటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 11: సంగారెడ్డి నియోజకవర్గ శాసన సభ ఎన్నికల కౌటింగ్ ఉత్కంఠంగా సాగింది. 19రౌండ్ల కౌటింగ్‌లో చివరి వరకు టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్, కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి మద్య హోరా హోరి సాగింది. 2,605 ఓట్ల ఆధిక్యంతో జగ్గారెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి 75922ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 73317ఓట్లు వచ్చాయి. 3వ స్థానంలో 7566ఓట్లతో బీజేపీ అభ్యర్థి నిలిచారు. సంగారెడ్డిలో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ఉహించిన ప్రజల అంచనాలు తారుమారాయ్యాయి. కౌటింగ్ ప్రారంభం నుండే జగ్గారెడ్డి స్వల్ప ఆధిక్యంలో నిలుస్తూ వచ్చారు. జగ్గారెడ్డి గెలుపును ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కౌటింగ్ కేద్రం వద్దకు చేరుకొని జగ్గారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో స్వీట్లను పంపిణీ చేసి, టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుండి భారీగా ఫ్లెక్సిలు ఏర్పాటు చేసి, బ్యాండ్ బాజాలతో జగ్గారెడ్డికి ఘన స్వాగతం పలికారు. తనపై నమ్మకంతో ఆదారించి గెలిపించిన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.