మెదక్

పంచాయతీ రిజర్వేషన్లు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, డిసెంబర్ 31: ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ముందుగా ఎస్టీ రిజర్వేషన్, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల, జనరల్ సీక్వెన్స్ ప్రకారం రిజర్వేషన్లు గ్రామపంచాయితీ ఎన్నికల్లో పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం మెదక్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్ జిల్లాలో 469 గ్రామపంచాయితీలు ఉన్నట్లుగా ఆయన తెలిపారు. వంద శాతం 63 గిరిజన తండాల్లో 32 శాతం మహిళలకు రిజర్వేషన్, మరో 31 శాతం జనరల్ కోటాలో రిజర్వేషన్ కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. వంద శాతం గిరిపుత్రులు ఉన్న ప్రాంతంలో 17 ఎస్టీ గ్రామాల్లో తొమ్మిది ఎస్టీ మహిళ, ఎనిమిది ఎస్టీ జనరల్‌గా రిజర్వేషన్ కెటాయించినట్లు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్‌లో భాగంగా 66కుగాను 33 శాతం మహిళలకు, మరో 33 శాతం జనరల్ కోటా క్రింద విభజించడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలో బీసీలకు 120 సీట్లు రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. అందులో 60 మంది మహిళలకు 60 జనరల్ కోటా క్రింద రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు. అన్ రిజర్వుడ్ కోటా క్రింద 203లో 102 మంది మహిళలకు, 101 జనరల్‌గా రిజర్వేషన్ కెటాయించడం జరిగిందన్నారు. ఎస్టీని మొదటి స్థానంలో జనాభ ప్రతిపాదికన ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రిజర్వేషన్లు సమతుల్యంగా కల్పించడం జరిగిందన్నారు. 2011 జనాభ ప్రకారం వీరందరికి 50 శాతం బీసీలకు, మిగిలిన 50 శాతం జనరల్ రిజర్వేషన్ క్రింద సీట్లు కెటాయించడం జరిగిందన్నారు. సర్పంచ్‌లు రిజర్వేషన్ల కెటాయింపులో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓలు రిజర్వేషన్లు కెటాయిస్తున్నట్లు తెలిపారు. పురుషులు, మహిళలు లాటరీ పద్దతిలో ఎంపిక జరుగుతుందన్నారు. పురుషులు 50 శాతం, మహిళలకు 50 శాతం వంతున సర్పంచ్‌ల కెటాయింపులు జరుగుతాయని తెలిపారు. గ్రామపంచాయితీలు 469 ఉండగా అందులో వార్డులు 4086 ఉన్నట్లు ఆయన తెలిపారు. అందులో ఎస్టీ వంద శాతం మహిళలు 240, జనరల్ 240 వార్డులలో మొత్తం 480 వార్డులలో వార్డు సభ్యులు పోటి చేస్తారని తెలిపారు. 17 గ్రామపంచాయితీల్లో ఎస్టీలలో 181 వార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు. అందులో 103 వార్డులు మహిళలు, 73 వార్డులు జనరల్ కోటా క్రింద రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. ఎస్సీ కోటా క్రింద 66 గ్రామపంచాయితీలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అందులో 643 వార్డులు ఉన్నాయని, 351 మంది మహిళలు, మిగిలినవి జనరల్ కోటా క్రింది పోటి చేయనున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్‌లో 497 వార్డు సభ్యులు ఉండగా 487 వార్డు సభ్యులు జనరల్ కోటా క్రింద పోటి చేస్తారని మిగిలినవి బీసీ రిజర్వేషన్ క్రింద పోటి చేయనున్నట్లు తెలిపారు. అన్ రిజర్వుడ్ క్రింద 852 మంది మహిళలు, జనరల్ 951 మంది పోటి చేస్తారని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్‌లో 351 మంది మహిళలు, జనరల్ కోటా క్రింద 291 మంది పోటి చేయనున్నట్లు తెలిపారు. సర్పంచ్‌లు రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిన రిజర్వేషన్‌లో పోటి చేస్తారన్నారు. త్వరలో గ్రామపంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామపంచాయితీ వార్డుల రిజర్వేషన్లను ఎన్నికల కమీషనర్‌కు పంపినట్లు తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ సీక్వెన్స్ ప్రకారం రిజర్వేషన్లు తయారు చేయడం జరిగిందన్నారు. మెదక్ జిల్లాలో 4.80 లక్షల ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో అధనంగా 54 వేల మంది ఓటర్లు కొత్తగా నమోదు అయినట్లు తెలిపారు. నర్సాపూర్, అందోల్, దుబ్బాక, నారాయణఖేడ్, గజ్వెల్, మెదక్ నియోజకవర్గాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికలు మూడు విడతలు జరగనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి విడతలో అల్లాదుర్గం, రేగోడ్, పెద్దశంకరంపేట, టేక్మాల్, హావేళి ఘణాపూర్, పాపన్నపేట మండలాలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 154 గ్రామపంచాయితీలు, 1400 వార్డులు ఉన్నట్లు తెలిపారు. రెండవ విడత నర్సాపూర్, చిలిపిచెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దుర్తి మండలాలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 1444 వార్డులు, 170 గ్రామపంచాయితీలు ఉన్నట్లు తెలిపారు. మూడవ విడతలో తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ ఉన్నట్లు, ఇందులో 1278 వార్డులు, 170 గ్రామపంచాయితీలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని తెలిపారు. ఎన్నికలు జరిగిన వెంటనే సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మొదటి విడత రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు స్వీకరించి స్క్రూటింగ్ చేస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో ఎన్నికల అధికారి ఎన్నికలు నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఓ హనూక్, డీఆర్‌ఓ సీతారామరావు, డీపీఆర్‌ఓ శైలేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు

సిద్దిపేట టౌన్, డిసెంబర్ 31: జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అంది, వారు సుఖంగా సంతోషంగా ఉండాలని..నూతన సంవత్సరం ఎన్నో అశయాలు లక్ష్యాలను సాధించి..సరి కొత్త ఆలోచనలతో ముందుకు పోవాలని ఆకాంక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణి రాష్ట్రంగా సస్యశ్యామలం కావాలన్నారు. నూతన సంవత్సరం వేడుకలు ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలన్నారు.