మెదక్

సిద్దిపేట ప్రాంతంలో ఆక్సిజన్ పార్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 2: సిద్దిపేట ప్రాంతంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చేలా అర్బన్ ఆక్సిజన్ పార్క్‌లు రూపుదిద్దుకుంటున్నాయని, త్వరలో ఈ పార్కులు అందుబాటులోకి రానున్నట్లు మాజీ మంత్రి, హరీష్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా మర్పడగ గ్రామ శివారు నాగుల బండ సమీపంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతున్న అర్బన్ అక్సిజన్ పార్క్ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో రోజు,రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేలా మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులో తెచ్చేలా ప్రయత్నమని, ఆ దిశగా అటవీ శాఖాధికారులు, అర్బన్ ఆక్సిజన్ పార్కులు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. ఫారెస్టుల్లో పర్యాటకులు సైతం సందర్శించేందుకు వీలుగా అదనపు హంగులు సమకూర్చాలని, పలు సూచనలు చేస్తు, అర్బన్ పార్కుతో పాటు, ఆక్సిజన్ పార్కు వివరాలపై ఆటవి శాఖ అధికారులను ఆరా తీశారు. అర్బన్ పార్కులో 9 కిలోమీటర్లు మేర కాలినడక నడుస్తు కలియ తిరిగి, అక్కడ పెంచుతున్న మొక్కలను క్షుణ్ణంగా పరిశీలించారు. అర్బన్ పార్కు సుందరికరణలో భాగంగా దాదాపు 340 ఎకరాల్లో 10కిలోమీటర్ల మేర బౌండరీలు మూసివేసి, ఆటవి సంపదను రక్షిస్తు ప్రజలకు అవగాహనతో పాటు, పర్యావరణ పరిరక్షణకు కావాల్సిన రీతిలో చర్యలు తీసుకుంటున్నట్లు ఆటవి శాఖాధికారులు వివరించారు. పట్టణ ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించేలా, ఈ పార్కు సుందరీకరణ ఉండాలని అటవీ శాఖాధికారులకు హరీష్‌రావు సూచించారు. ఈ మేరకు చుట్టుకొలతల్లో 14 స్కైర్ మీటర్ల మేర అర్బన్ పార్కును చేపట్టినట్లు జిల్లా ఆటవీ శాఖాధికారి శ్రీ్ధర్ తెలిపారు. ప్రకృతి దర్శనం, ఉద్యానవనం ఏర్పాటు, 10 ఎకరాల్లో ఆక్సిజన్ పార్కు, 9కిలోమీటర్ల మేర నడక దారులు, ఓపెన్ జిమ్స్, పార్కు ప్రాంత ఆవరణలో అక్కడ, అక్కడ చిన్నారులకు ఆట విడుపు కేంద్రాలు, రాశీవనం, నక్షత్ర వనం, 30 ఫీట్ల ఎత్తులో ఉండే గడియారం, గజబౌళీలు, ధ్యాన మందిరం, బట్టర్‌ఫ్లై పార్కు, హెర్బల్ పార్కు, పార్కు మధ్యలో ఉన్న కుంటను సుందరికరణ చేసి అక్కడికి వచ్చిన వారికి పిక్నిక్ పార్కులా, అనువుగా, ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు ఉండాలని ఆటవి శాఖాధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటవి శాఖ సిద్దిపేట రెంజ్ అధికారి లక్ష్మణ్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
పెద్దశంకరంపేట, జనవరి 2: ఏ మతం వారైనా ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుంటే మానసిక ప్రశాంతత దొరుకుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహాముద్ అలీ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఉన్న తబ్క్ అజ్మీర్ దర్గాను సందర్శించి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక ప్రశాంతతతో పాటు జీవితం సాలఫ్యం అవుతుందన్నారు. ఎందరో మహానుభావులు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొని ప్రజలకు ఆధ్యాత్మికతపై అవగాహణ కల్పిస్తుండటం వల్ల ఎంతో మంది ఆధ్యాత్మికం వైపు మల్లుతున్నారని, ఇది శుభ పరిణామం అన్నారు. అజ్మీర్ దర్గా వ్యవస్థాపకులు డాక్టర్ రహీమ్ చిస్తీ తన చిన్ననాటి బాల్యమిత్రుడని, ఆయన ఆహ్వానం మేరకు దర్గాను సందర్శించానని తెలిపారు. ఈ సందర్భంగా దర్గాకు ఆయన ఛాదర్‌ను సమర్పించి ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడని, అది గుర్తుంచుకొని అందరు కలిసిమెలసి ఉంటూ సామాజిక సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెరాస లౌకిక వాదానికి ఎప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు. కులమతాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని, అన్ని కులమతాల వారికి సమాన ప్రాతినిథ్యం కల్పించిన ఏకైక పార్టీ తెరాస పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మన్ విగ్రం రామాగౌడ్, జాతీయ ఆహార సభ్యులు విగ్రం శ్రీనివాస్‌గౌడ్, మండల తెరాస అధ్యక్షులు విజయరామరాజు, మైనార్టీ నాయకులు మోయిజ్‌ఖాన్, రైతు సమన్వయ సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేష్‌గౌడ్, మురళీపంతులు, మాజీ సర్పంచ్ జంగం శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల సామగ్రిని
మండల కేంద్రాలకు తరలించాలి
- డీపీఓకు కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశం
మెదక్, జనవరి 2: పంచాయితీ ఎన్నికల నిర్వాహణకు వినియోగించే సామాగ్రిని మండల కేంద్రాలకు త్వరితగతిన పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిల్వ ఉంచిన ఎన్నికల సామాగ్రిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వాహణకు సంబంధించిన పూర్తి స్థాయి సామాగ్రి జిల్లాకు చేరుకుందా అని డీపీఓ హనూక్‌ను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన సామాగ్రిని మండలంలో ఉన్న పంచాయితీల వారిగా విభజించి తక్షణం పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు విడతల్లో ఎన్నికల నిర్వాహణ ఉన్నందున మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించే మండలాలకు ఎన్నికల సామాగ్రి సత్వరం చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వాహణకు సంబంధించిన పుస్తకాలు అందజేయాలన్నారు. ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు అవసరమైనవన్ని పుస్తకాలను తెప్పించాలని సూచించారు. ఎన్నికలను నిర్వహించే అధికారులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల నిర్వాహణ పుర్తయిన వెంటనే కౌటింగ్ నిర్వహించేందుకు అవసరమైన సామాగ్రిని సైతం అధికారులకు అందుబాటలో ఉంచాలన్నారు. ఎన్నికల నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీపీఓకు కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు.

సంగారెడ్డిలో కేరళ సీఎం
దిష్టిబొమ్మ దగ్ధం
* శబరిమలలో మహిళల ప్రవేశం సరికాదు
సంగారెడ్డి టౌన్, జనవరి 2: శబరిమలలో ఎన్నోయేళ్లుగా వస్తున్న ఆచారాన్ని కాదని, ఆలయంలో మహిళల ప్రవేశం సరికాదని, ఇది హిందూ మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని సంగారెడ్డి అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, కేరళ సీఎం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకించారు. బుధవారం సంగారెడ్డిలో కేరళ సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అత్యంత ప్రవిత్రంగా భావించే ఆలయంలోకి మహిళల ప్రవేశం ఎందుకని మండిపడ్డారు. దీనికి కారణం కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రేనని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు రాము, మోహన్, వెంకటస్వామి, సంతోష్, నరేష్, మల్లేశం, బీజేపీ నాయకులు ద్వారక రవి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్ నరసింహన్‌ను కలసిన
జాతీయ యూత్ అవార్డు గ్రహీతలు
గజ్వేల్, జనవరి 2: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను జాతీయ యూత్ అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింలు నేతృత్వంలో బుధవారం రాష్ట్ర యువజన సంఘాల నేతలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక, సేవా కార్యక్రమాలను గవర్నర్ నరసింహన్ దృష్టికి తెచ్చారు. అయితే పల్లె ప్రాంతాల అభివృద్దితోనే దేశ పురోగతి ఆధారపడి ఉందని, ఇందుకోసం యువత నడుం బిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు జాతీయ యూత్ అవార్డు గ్రహీత, రాష్ట్ర యువజన సంఘాల ప్రధాన కార్యదర్శి దేశబోయిని నర్సింలు తెలిపారు. అయితే యువజన సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలకు గవర్నర్ నరసింహన్ సహకారం కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ యూత్ అవార్డు గ్రహీతలు సామల వేణు, కలింగ శేఖర్, నాగేశ్వర్‌రావు, రాజ్ కుమార్, కిరణ్‌కుమార్, రాజేందర్, మహేశ్, సిద్దిపేట జిల్లా ప్రతినిదులు సాదక్‌పాషా, మర్కంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

శబరిమలైలో యువతుల ప్రవేశం దురదృష్టకరం
జరగబోయే పరిణామాలకు పాలకులదే బాధ్యత * రామకోటి భక్తసమాజం వ్యవస్థాపకులు రామరాజు
గజ్వేల్, జనవరి 2: హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పాలకులు వ్యవహరిస్తే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని రామకోటి భక్తసమాజం వ్యవస్థాపక చైర్మెన్ రామకోటి రామరాజు పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. కేరళ సర్కార్ నిర్లక్ష్యం ఫలితంగానే కోర్టు తీర్పు వెలువడగా, ఎంతో నియమనిష్టలతో దీక్ష చేసే అయ్యప్పల భక్తి భావనను దెబ్బతీసే విధంగా యువతులను శబరిమలై క్షేత్రంలోకి పంపించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హిందూ దేశంలో హిందువులకే రక్షణ లేకపోతుండగా, సంస్కృతి, సాంప్రదాయాలు పరిరక్షించాల్సిన సర్కార్‌లు అందుకు భిన్నంగా వ్యవహరించడం దురదృష్టకరం కాగా, కేరళతోపాటు ఏ రాష్ట్రంలో కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించే ప్రభుత్వాలకు తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ దిశగా రామకోటి భక్తసమాజం దృష్టి సారించి హిందువులను చైతన్యం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. దేశంలో ఏ మతం, ఏ కులంవారైనా జీవించే హక్కు ఉండగా, పాలకులు మాత్రం ఓట్ల కోసం, సీట్ల కోసం మతాల ప్రాతిపదికన వివిద పథకాలు అమలు చేస్తూ హిందువులను మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియమనిష్టలతో దీక్షాకాలం పూర్తి చేసుకొని అయ్యప్ప దర్శనానికి వెళ్లిన స్వాములను బాధించే విధంగా బిందూ, కనకదుర్గ అనే యువతులు బొట్టు లేకుండా కెమరాలు వెంట బెట్టుకొని కేరళ పోలీసుల సహకారంతో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప గడప దొక్కడాన్ని ఏ ఒక్క హిందువు జీర్ణించుకోలేకపోతుండగా, కేరళ సర్కార్‌కు త్వరలోనే తగిన గుణపాఠం జరుగుతుందని హెచ్చరించారు.

జాతీయస్థాయి క్రీడాకారునికి
సీఐ ఆర్థిక సాయం
చేర్యాల, జనవరి 2: మండలంలోని ముస్త్యాల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎండి అజహర్ అనే విద్యార్ది హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్- 14 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి ఎంపిక కాగా అతనికి చేర్యాల సిఐ రఘు బుధువారం 3వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈనెల 15 నుండి హర్యానా రాష్ట్రంలో ఇసార్‌లో జరుగు క్రీడలలో అజహర్ ఆడనున్నందున పేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో సీఐ ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ విద్యార్దులు చదువుతో పాటు క్రీడలలో సైతం ముందుకు రావాలని అన్నారు.

ప్రముఖ సిద్దాంతి చంద్రశేఖరశర్మ దంపతులకు
మాధవానంద సరస్వతీ తీర్థ ఆశీస్సులు
గజ్వేల్, జనవరి 2: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాంపూర్ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతితీర్థను బుధవారం ప్రముఖ వాస్తు సిద్ధాంతి, శ్రీ విద్యాధరి క్షేత్ర వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శ్రీ విద్యాధరి క్షేత్రం వద్ద చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, వేద విద్యకు అందిస్తున్న చేయూత, నాచగిరి శ్రీ క్షేత్రం వ్యవహారాలను స్వామీజీ దృష్టికి తెచ్చారు. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ భక్తుల సౌకర్యాల కల్పనలో నిమగ్నమవ్వాలని శ్రీ మాధవానంద తీర్థ స్వామీజి సూచించారు. ఈ కార్యక్రమంలో వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్ర సేవికా సమితి అధ్యక్షురాలు యాయవరం అరుణ, ఆలయ మేనేజర్ రఘుపవన్ తదితరులు ఉన్నారు.

భూముల జాయింట్ సర్వే పూర్తి చేయాలి
- అధికారులకు జేసీ నగేష్ ఆదేశం
మెదక్, జనవరి 2: రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భూములను జాయింట్ సర్వే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో తహశీల్దార్లు, అటవిశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అటవీ భూములను సాగు చేసుకొని జీవనం సాగించే వ్యక్తులకు భూ యాజమాన్య హక్కు పత్రాలను అటవీశాఖ ఆదేశాలు జారీ చేసిందన్నారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే జరిపాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ఆధారంగా యుద్ధ ప్రాతిపదికన సర్వేను పూర్తి చేయాలన్నారు. గ్రామాల వారిగా అటవీభూముల వివరాలను తహశీల్దార్లకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ జాబితా ప్రకారం అధికారులు సంయుక్తంగా సర్వే జరిపి నివేదికను త్వరితగతిన అందజేయాలన్నారు. ఈ భూములకు అటవి భూ యాజమాన్య హక్కు పత్రం మాత్రమే ఉంటుందన్నారు. ఈ భూములు కలిగిన రైతుల వివరాల నమోదుకు ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లో పహాణిలో నమోదు చేయకూడదని తహశీల్దార్లను ఆదేశించారు. జాయింట్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని తహశీల్దార్లు, ఫారెస్ట్ అధికారులకు జేసీ సూచించారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ పద్మజారాణితో పాటు తహశీల్దార్లు, ఎఫ్‌ఆర్వోలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లాలో 30(ఏ) యాక్ట్ అమలు
- ఎస్పీ కుమారి చందనాదీప్తి
మెదక్, జనవరి 2: 2019 జనవరి 1 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30ఎ పోలీస్ యాక్ట్ అమలులోకి వచ్చిందని ఎస్పీ చందనాదీప్తి బుధవారం మాట్లాడుతూ తెలిపారు. ఈ యాక్ట్ ప్రకారం పోలీసుల అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ఆమె వెల్లడించారు. ప్రజాధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేఖ కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని చందనాదీప్తి హెచ్చరించారు. ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

పంచాయతీ పోరుకు నగారా మోగడంతో
రాజకీయ యుద్ధ వాతావరణం

* గ్రామాల్లో కత్తులు దూసుకుంటున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు
* నియోజకవర్గంలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు
* 148 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు రంగం సిద్ధం
గజ్వేల్, జనవరి 2: పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నేతలకు ఎన్నికల కమిషన్ నగారా మోగించడంతో ఆరంభంలోనే గ్రామాల్లో రాజకీయ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. నియోజకవర్గం లోని గ్రామాలలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడే కత్తులు దూసు కుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీతో టీఆర్‌ఎస్ నేతలు రెట్టించిన ఉత్సాహంతో దూసుకెల్తుండగా, పోయిన పరువును కాపాడు కునేందుకు కాంగ్రెస్ తన వంతు యత్నాలను ముమ్మరం చేస్తూ ఓటర్ల ను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలోని గజ్వేల్, కొండపాక, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, వర్గల్ మండలా ల పరిదిలోని 148 పంచాయతీలలో 2వ విడతలో ఎన్నికలు జరగనుండగా, ఇందుకోసం ఇప్పటికే అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియను సిద్దం చేసింది. ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒకరోజు ముందుగానే పంచాయతీలు, వార్డుసభ్యుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయగా, గజ్వేల్ మండలంలో 25 పంచాయతీలకుగాను 230 వార్డులుగా ఎంపిక చేశారు. అలాగే జగదేవ్‌పూర్ మండలంలో 29 పంచాయతీలకుగాను 256 వార్డులు, ములుగు మండలంలో 26 పంచాయతీలకుగాను 222 వార్డులు, వర్గల్ మండలంలో 27 పంచాయతీలకుగాను 238 వార్డులు, కొండపాక మండలంలో 25 పంచాయతీలకుగాను 238 వార్డులు, మర్కూక్ మండలంలో 16 పంచాయతీలకుగాను 140 వార్డుల రిజర్వేషన్‌లు పూర్తి చేసి ఎన్నికల కమీషన్‌కు నివేదించారు. అయితే 2వ విడతలో జరగనున్న ఈ గ్రామపంచాయతీల ఎన్నికలకుగాను 11న నోటిఫికేషన్ జారీ చేయనుండగా, ప్రచారానికి 14 రోజుల గడువు విదిస్తూ ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేందుకు యంత్రాంగం దృష్టి పెట్టింది.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లలో పెరిగిన తీవ్ర పోటీ
గ్రామపంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో సర్పంచ్ పదవిని ఆశిస్తున్న నేతల మద్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే గ్రామాల్లో విందు రాజకీయాలు ప్రారంభం కాగా, తమకు ఎలాగు పార్టీ పెద్దల ఆశిస్సు లు ఉంటాయనే నమ్మకంతో ఉన్న నేతలు తమ ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టారు. అయితే ఒకే పార్టీ నుండి పోటీ తీవ్రంగా ఉండడంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారగా, చివరకు ఎటు దారి తీస్తుందో నని ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే బుజ్జగింపు ల పర్వం ఆరంభం కాగా, రోజురోజుకూ వేడెక్కుతున్న రాజకీయంతో గ్రామాల్లో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు తమ నిఘాను ముమ్మరం చేస్తూ చర్యలు చేపట్టారు.