మెదక్

రాష్ట్రావతరణ దినోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మే 20: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకులను జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సూచించారు. ఈ విషయమై శుక్రవారం ఆయన హైదరాబాద్ నుండి జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పండుగ వాతవరణంలో వేడుకలు నిర్వహించాలని, ఉదయం జెండావిష్కరణలు చేయాలని సూచించారు. అన్ని స్థాయిల్లో స్వీట్లు, పండ్లను పంపిణీ చేయాలని, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. రెస్టారెంట్లు, హోటళ్లలో తెలంగాణ రుచులతో మెనును ఆ రోజు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలు, ఇతర సంస్థలను అందంగా అలంకరణ చేయాలని, కార్మికులకు స్వీట్ల పంపిణీ జరిగేట్లు చూడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రగతిని తెలుపుతూ బ్యానర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని, ఆర్టీసి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో బ్యానర్లు ప్రదర్శించాలని తెలిపారు. అమర వీరుల కుటుంబాలను ఆహ్వానించి సత్కరించాలని, కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని, వ్యాస రచన, వకృత్వ పోటీలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ ఈ సారి వేడుకలు ఒక్కరోజే అయినప్పటికీ ఘనంగా జిల్లావ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వ సూచనల మేరకు వేడుకలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ పి.వెంకట్రామ్‌రెడ్డి, డిఆర్వో దయానంద్, జెడ్పీ సిఈఓ వర్షిణి, ఎజెసి వాసం వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు శ్రీనివాస్‌రెడ్డి, నగేష్ పాల్గొన్నారు.