మెదక్

ధర్మరక్షణకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి భగవంతుని అనుగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మే 23: గత ప్రభుత్వాలన్నీ ఆలయాలనుంచి డబ్బులు తీసుకున్నవారేనని, ఈ సర్కార్ మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి నిధులిచ్చి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి అన్నారు. ధర్మరక్షణకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి భగవంతుని అనుగ్రహం ఉంటుందన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేట ప్రసన్నాంజనేయాలయంలో శ్రీరామ భవన్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం భవన్‌లో హనుమాన్ స్వాములకు భిక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ హనుమాన్ దీక్ష స్వాముల కోసం అందమైన భవనంతో పాటు వారికి నిత్యం భోజనం, వసతి కల్పించేందుకు ఈ భవనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ భవనంలో ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్త్తూ ప్రజల్లో భక్త్భివాలు పెంపొందించాలన్నారు. తెలంగాణకే గుండెకాయ సిద్దిపేట పట్టణమన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావు ఈ ప్రాంతానికి చెందన వారుకావడమే కీలక నిర్ణయాలు ఇక్కడి నుంచే తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకొని అవినీతి, అక్రమాలు లేకుండా ప్రజాభీష్టమైన పాలన సాగిస్తున్న కెసిఆర్‌కు మంగళశాసనాలు అందిస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల విద్యాభివృద్ధి కోసం 250 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామనడం మంచి నిర్ణయమని అభినందించారు. వనరులు, వసతులు ఉన్నా చేయాలనే పాలకులకు చిత్తశుద్ధి, చొరవ అవసరమన్నారు. వినయ విధేయత, పరాక్రమాలకు, సేవాగుణానికి హనుమంతుడు ఆజ్యుడన్నారు. తప్పుచేస్తే ఎత్తి చూపాలని, ధర్మాన్ని కాపాడాల్సిన చొరవను హనుమాన్ స్వాములు తీసుకోవాలన్నారు. ధర్మరక్షణ కోసం ఏ గ్రామంలోని హనుమాన్ దీక్షపరులు దండుగా కదలాలన్నారు.
రామానుజన్ బాటను అందరూ ఆచరించాలి
సమాజంలో ప్రేమసూత్రాన్ని వివరించి సమాజంలోని ధనిక, పేద అందరూ ఒకటేనని చాటిచెప్పిన రామానుజన్ బాటలో నడుచుకోవాలన్నారు. వెయ్యేండ్ల కిందనే సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి కోసం కృషి చేశారన్నారు. భగవంతుని మంత్రాన్ని పేదల కష్టాలను తీర్చేందుకు అవసరమని రామానుజన్ గొంతెత్తి చాటాడన్నారు. రామునిమార్గం, సమతాసూత్రాన్ని ప్రతిఒక్కరు అనుసరించాలన్నారు. వెయ్యేండ్ల కిందనే సమాజంలోని దళిత, పేద వర్గాలకు ఆలయ ప్రవేశానికి మార్గం తెరిచాడన్నారు. 2017లో రామానుజన్ వెయ్యేండ్ల జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. వైదికభవనం, 216అడుగుల పంచలోహ మూర్తి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వెంకటేశ్వరస్వామికి రామానుజన్ గురువున్నారు. రామానుజన్ సమతామార్గంలో నడుచుకుంటే శ్రీనివాసుని కటాక్షం లభిస్తుందన్నారు. సిద్దిపేటలో వికాసతరంగిణి భవనాన్ని చక్కని స్ఫూర్తికేంద్రంగా ఉండాలన్నారు. పెద్దజియర్‌స్వామి కాలం నుంచి సిద్దిపేటలో అధ్యాత్మికత విరాజిల్లుతుందన్నారు. సమాజంలో భక్తి,శ్రద్ధ, ఆధ్యాత్మికత చాటేందుకు కృషి చేయాలన్నారు. భగవద్గీత, మూలగ్రంధాలను చదివించి ఏముందో తెలుసుకునే అవకాశం కల్పించాలన్నారు. థార్మిక కార్యక్రమాల పై శిక్షణ ఇవ్వడంతో పాటు భక్తిమార్గంను పెంచే పుస్తకాలు, కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. భక్తి,అధ్యాత్మికత పెరిగితే సమాజాభివృద్ధికి దోహద పడుతుందన్నారు.
జియర్‌స్వామి చేతులమీదుగా ప్రారంభించుకోవడం అదృష్టం: హరీష్‌రావు
సిద్దిపేటలో ప్రసన్నాంజనేయాలయంలో నిర్మించిన శ్రీరామభవన్‌ను చినజియర్‌స్వామి కరకములచే ప్రారంభించుకోవడం అదృష్టమని మంత్రి హరీష్‌రావు అన్నారు. స్వామి అందరికి ఆరాధ్యుడని, వారి పై అందరికి ప్రేమ, భక్తి ఉంటుందన్నారు. సిద్దిపేటలో వికాస తరంగిణి భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించామని, స్వామి అనుమతితో భూమిపూజ నిర్వహిస్తామన్నారు. వారి సూచనల మేరకు భవనాన్ని అన్ని హంగులతో నిర్మిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్తిగా ఏర్పడిందని, వెంకటేశుని కృపతో స్వామి ఆశీస్సులతో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు.
స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం
స్థానిక గణేశ్‌నగర్‌లోని ప్రసన్నాంజనేయాలయానికి శ్రీరామభవన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చినజీయర్‌స్వామి, మంత్రి హరీష్‌రావుకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీరామభవన్‌లో హనుమాన్ భక్తులకు భిక్ష(అన్నదానం) ప్రారంభించారు. అనంతరం స్వామిజీ మంత్రి హరీష్‌రావు, ఆలయ కమిటి ప్రతినిధులకు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, అర్చకులు వెంకటరమణాచార్యులు, కృష్ణమాచార్యులు, వెంకటనర్సింహాచార్యులు, శేషాచార్యులు, కమిటి సభ్యులు పాల్గొన్నారు.