మెదక్

అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 3: స్వరాష్ట్ర సాధన కోసం వివిధ వర్గాలకు చెందిన వారు ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అందించిన ఉద్యోగ బాధ్యతలను కలెక్టర్ రొనాల్డ్ రోస్ శుక్రవారం శాఖల వారీగా, కేటగిరీల వారీగా బాధ్యతలు అప్పగించారు. రెండవ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా జిల్లాలోని 47 మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు చెందిన వారిలో ఒక్కొక్కరికి ఒక్కో ఉద్యోగాన్ని కల్పిస్తూ మంత్రి టి.హరీష్‌రావు చేతుల మీదుగా పత్రాలను అందించారు. ఈ మేరకు కలెక్టర్ రొనాల్డ్ రోస్, డిఆర్‌ఓ దయానంద్‌లు శుక్రవారం ఉద్యోగాలు పొందిన కుటుంబాల వద్దకు చేరుకుని వారికి ఫలానా శాఖలో ఫలానా కేటగిరికి చెందిన ఉద్యోగం ఇస్తున్నట్లు ఈ మేరకు విధుల్లో చేరాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆహ్వానించారు. వారి విద్యార్హతను బట్టి ఆయా శాఖల్లో కేటగిరీలను కేటాయించారు.