మెదక్

ఉద్యోగాల్లో సిద్దిపేటను ముందు వరుసలో నిలుపుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 7: ఉద్యమంలో ముందున్న సిద్దపేటను ఉద్యోగాల్లో సైతం ముందువరుసలో నిలపడమే తన లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ మెటీరియల్‌ను పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేట ప్రాంత అభ్యర్థులకు నిష్ణాతులైన ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అభ్యర్థులకు ఉచితంగా భోజన వసతి, అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. ఇటీవల కానిస్టేబుల్ ఉచిత శిక్షణలో సిద్దిపేట నుంచి 275మంది రిటర్న్‌టెస్టులో క్వాలిఫై అయ్యారని, వారికి ఫిజికల్ టెస్టులో సైతం శిక్షణ ఇచ్చామన్నారు. సుమారు 100మంది ఈ ప్రాంతం నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. 16లక్షలు వెచ్చించి ఉచిత గ్రూప్ 2శిక్షణ, భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. కనీసం 50మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందితేనే ఈ శిక్షణకు సార్థకత లభిస్తుందన్నారు. గ్రూప్ 2, కానిస్టేబుల్ శిక్షణతో సిద్దిపేట ఒకత్త ఒరవడి సృష్టించిందన్నారు. హైద్రాబాద్‌లో కోచింగ్ తీసుకుంటే 25వేలు అభ్యర్థికి ఖర్చు అవుతుందన్నారు. అదే ప్రమాణాలతో హైద్రాబాద్ కోచింగ్ సెంరట్లకు ధీటుగా సిద్దిపేటలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవల నీటి పారుదలశాఖలో 250మందికి ఎఇలుగా ఉద్యోగ నియామకపత్రాలు అందించామన్నారు. వీరిలో 200మంది వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం తనకు సంతోషకరంగా ఉందన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదన్నారు. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించొచ్చన్నారు. సిద్దిపేట గ్రూప్ 2శిక్షణకు టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ చక్రపాణిని రప్పించి ఒకరోజు క్లాసు నిర్వహిస్తామన్నారు. అన్ని ప్రమాణాలతో కూడిన టిఎస్‌పిఎస్‌సి సభ్యులు ఆమోదమైన మెటీరియల్స్ అందించామన్నారు. ఈశిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని మెజార్టీ అభ్యర్థులు ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు.
విద్యాకేంద్రంగా సిద్దిపేట
సిద్దిపేట పట్టణాన్ని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. సిద్దిపేటలో ఇప్పటికే డిగ్రీ, పీజి కళాశాలలు ఉన్నాయన్నారు. 4పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్న ఏకైక నియోజకవర్గం సిద్దిపేటన్నారు. 33కోట్లతో మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల నిర్మిస్తున్నామన్నారు. 3కోట్లతో మహిళ డిగ్రీ కళాశాలకు పక్క్భావనం నిర్మిస్తున్నామన్నారు. కెజిటు పీజిలో భాగంగా సిద్దిపేట, చిన్నకోడూరులో 25కోట్లతో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిద్దిపేటలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మిస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రం కాకున్నా ఎంసెట్, బిఇడి, ఎడ్‌సెట్ వంటి అర్హత పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే సిద్దిపేట జిల్లా కేంద్రమైతుందన్నారు. అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో సిద్దిపేట మండలం, ఉత్తమ పంచాయతీలు ఇబ్రహీంపూర్, లింగారెడ్డిపల్లి అందుకున్నాయన్నారు. రాష్ట్ర స్థాయిలో హరితమిత్ర అవార్డు సిద్దిపేట మున్సిపల్‌కు దక్కిందన్నారు. సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చడమే తన లక్ష్యమన్నారు. ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందంజలో ఉందని, ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే హరీష్‌రావు నంబర్‌వన్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందాడన్నారు. ఈ ప్రాంత ఉద్యోగాల అభివృద్ధి కోసం కానిస్టేబుల్, గ్రూప్ 2శిక్షణలు ఏర్పాటు అభినందనీయమన్నారు. అంతకుముందు శిక్షణ పొందిన అభ్యర్థులకు 6లక్షల విలువైన మెటీరియల్స్ అందించారు.
బాధితులకు చెక్కుల పంపిణి
సిద్దిపేట మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న ఇండ్లకు నష్టపరిహారం చెక్కులను 85మంది మంత్రి హరీష్‌రావు అందించారు. ఒక్కొక్కరికి 3200రూ. చొప్పున 2.75లక్షల చెక్కులను అందించారు. అలాగే ఆపద్బందు, ఎస్సీ అట్రాసిటి బాధితులకు చెక్కులను అందించారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.