మెదక్

ఎటిఎంలు ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, జూన్ 7: పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ బస్టాండ్ సమీపంలో ఉన్న టాటా ఇండిక్యాష్ ఎటిఎంలను దుండుగులు ధ్వంసం చేసి రూ.16 వేల 700 నగదును దోచుకెళ్లారు. సోమవారం రాత్రి కొత్తపల్లిలోని ఎటిఎంలోకి దొంగలు చొరబడి టాటా ఇండిక్యాష్‌కు చెందిన రెండు ఎటిఎంలను గడ్డపారలతో ధ్వంసం చేశారు. ఎటిఎం మిషన్ పైభాగంలో ఒక మిషన్‌లో రూ.14 వేలు, మరొక మిషన్‌లో రూ.2 వేల 700 నగదును దోచుకెళ్లారు. ఎటిఎం లోపలి లాకర్ రాకపోవడంతో దుండగులు వెనుదిరిగారు. ఎటిఎంల లోపలి లాకర్ తెరుచుకుంటే ఐదు లక్షలకుపైగా ఉన్న నగదు అపహరణకు గురై ఉండేవని బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు. ఎటిఎంలు ధ్వంసమైన విషయాన్ని తెలుసుకున్న మెదక్ రూరల్ సిఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్సై సందీప్‌రెడ్డితో పాటు క్లూస్ టీమ్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎటిఎం సెంటర్‌లో ఉన్న సిసి కెమెరాల ఫుటేజి ఆధారంగా ఒకరిని అనుమానితునిగా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్‌రెడ్డి తెలిపారు. ఎటిఎంను ధ్వంసం చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సిఐ రామకృష్ణ, ఎస్సై సందీప్‌రెడ్డి వెల్లడించారు.