మెదక్

కోదండరాంను విమర్శించడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 9: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉన్నటువంటి తెలంగాణ జెఎసికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ కోదండరాంను దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా జెఎసి చైర్మన్ వై.అశోక్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డిలోని ఎంపిజె కార్యాలయంలో జెఎసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదండరాంను విమర్శించడమంటే తెలంగాణ ఉద్యమ కారులను అవమానించడమే అవుతుందన్నారు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న కాలంలో ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడ్డ ఉద్యమ ద్రోహులు కూడా విమర్శలకు దిగడం దారుణమన్నారు. ప్రజలే కేంద్రంగా, ప్రజాస్వామికి విలువలే పునాదిగా, సామాజిక తెలంగాణ కోసం జెఎసి కొనసాగుతుందన్నారు. ఈ మేరకు జిల్లా జెఎసిని బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించడం జరిగిందని, రాజకీయాల కోసం కాకుండా ప్రజాసమస్యలే ఎజెండాగా కొనసాగుతుందన్నారు. సమావేశంలో జెఎసి నాయకులు అన్వర్, కెంపుల రాజు, బీరయ్య యాదవ్, సయ్యద్ గౌస్, చంద్రారెడ్డి, వినోద్‌కుమార్, గోపాల్‌రెడ్డి, అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.