మెదక్

ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 9: రెండేళ్లుగా నిరాశ, నిస్పృహలకు గురైన అన్నదాతలు ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో హుషారుగా ఖరీఫ్ పనులకు సిద్ధతమవుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు ఈ యేడాది పుష్కళమైన వర్షాలు కురుస్తాయని తేల్చిచెప్పడంతో వ్యవసాయదారుల్లో ఆశలు రేకెత్తాయ. మృగశిరాకార్తె ప్రవేశానికి ముందునుంచే వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుని సాధారణం మొదలుకుని భారీ వర్షాలు కురియడంతో రైతుల్లో పట్టరాని ఆనందం వ్యక్తమవుతోంది. వేసవి కాలంలోనే దుక్కులు దున్ని భూములను సిద్ధం చేసుకున్నారు. ఈ యేడాది ఖరీఫ్‌లో సాగు చేసే వివిధ పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువుల కోసం రైతులు పరుగులు పెడుతున్నారు. మృగశిరా కార్తె ప్రారంభం కాగానే విత్తనాలు విత్తుకోవడం తెలంగాణ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోంది. ఖరీఫ్‌లో ప్రధానంగా పెసర, మినుము, పచ్చజొన్న, జనుము, జిలుగ, సోయాబీన్, పచ్చజొన్న, కంది తదితర ఆహార పంటలను సాగు చేస్తుంటారు. కొన్ని సంవత్సరాలుగా పత్తి సాగు విస్తీర్ణం విపరీతంగా పెరగడంతో ఆహార పంటల సాగు కనుమరుగైంది. పత్తి సాగు కష్టాలపై రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఫలిస్తున్నాయి. ఈ యేడాది కూడా అధిక మొత్తంలో పత్తిసాగు చేసేందుకే రైతులు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. ఖరీఫ్‌లో పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల నిమిత్తం పంట రుణాల కోసం బ్యాంకుల్లో దరఖాస్తులు చేసుకోవడం ప్రారంభమయ్యాయి. కొంత మంది రైతులు విత్తనాలు విత్తుకోవడం ప్రారంభించగా మరికొందరు మరిన్ని వర్షాలు కురిస్తేకానీ పనుల ప్రారంభానికి ఉపక్రమించే వీలు లేదనిపిస్తోంది. ప్రభుత్వం పంటల సాగుకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని ప్రకటిస్తోంది. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ విత్తనాల్లో నాణ్యత లోపించిందని రైతులు పెదవి విరుస్తున్నారు. వరుణుడిపైనే ప్రభుత్వం, యంత్రాంగం, వ్యవసాయదారులు గంపెడు ఆశలు పెట్టుకుని కూర్చున్నారు. వారి ఆశలను వమ్ము చేయకుండా జిల్లాను పట్టి పీడిస్తున్న కరువు రక్కసిని పారద్రోలడానికి కావల్సినన్ని వర్షాలను కురిపించాలని వరుణుడిని కోరుకుందాం.