మెదక్

బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 9: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ జెడి ఎ.మాధవి శ్రీలత సూచించారు. ఈ పంటల బీమా పథకాలపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద మొక్కజొన్న పంటను గ్రామ యూనిట్‌గా, వరి, జొన్న, పెసర, మినుము, కంది, వేరుశనగ, సోయ చిక్కుడులను మండల యూనిట్‌గా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ పంటల బీమా మొత్తం ఆయా పంటల రుణ పరిమితి మేరకు ఉంటుందన్నారు. ఈ పంటలకు ఖరీఫ్‌కు గాను బీమా మొత్తం 2శాతం ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వరి పంటకు 1.5శాతం, మిరప, పత్తి పంటలకు 5శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని, జూలై 31లోపు ఈ బీమా ప్రీమియంలు చెల్లించాలని సూచించారు. ఫలస్ బీమా పథకాన్ని (ఎఐసి ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ ) వారు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వాతావరణ ఆధారిత బీమా పథకంలో పత్తి పంటను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ పంటకు ఒక ఎకరాకు బీమా మొత్తం రూ.24వేలు రైతు కట్టాల్సిన ప్రీమయం 5శాతం అంటే రూ.1200 ఉంటుందన్నారు. ఈ బీమా పథకాన్ని రిలయన్స్ జనరల్ ఇన్యూరెన్స్ కంపెనీ వారు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు కట్టే బీమా ప్రీమియంలను మండలాల వారీగా ఎజెంట్లు స్వీకరిస్తారని తెలిపారు. సమీక్షలో నాబార్డ్ ఎజిఎం రాజుకుమార్ , లీడ్ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు.