మెదక్

2019లో కాగ్రెస్‌కే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్చారం, జూన్ 10: పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తలతోనే పార్టీని ముందుకు తీసుకెళ్లవచ్చని జిల్లా డిసిసి అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన కొల్చారం బాబా ఫంక్షన్‌హాల్‌లో మండల కాంగ్రెస్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహించగా సునితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీయేనని, సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడు రుణపడి ఉంటామన్నారు. ప్రభుత్వం లేదని అధైర్యపడకుండా కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. తెరాస ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. అనంతరం జడ్పీటిసి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మిషన్ కాకతీయ పనులు నత్తనడకన నడుస్తున్నాయని, వాటిని పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడుపాయల దుర్గ్భావాని దర్శనానికి పోతన్‌శెట్టిపల్లి నుంచి నేరుగా ఏడుపాయలకు బ్రిడ్జి పనులను అప్పట్లో మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగానే పనులను ప్రారంభించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆప్కో డైరెక్టర్ అరిగె రమేశ్‌కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలు భయపడకుండా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే అందరూ కలిసి మాట్లాడుకుందామన్నారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ నరేందర్‌రెడ్డి, మండల అధ్యక్షురాలు రజిని, ఉపాధ్యక్షురాలు మేఘామల సంతోష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, వీరారెడ్డి, పాండరి వెంకటేశం, మనోహర్, కిష్టయ్య, శ్రీశైలం, మల్లేశం, చిట్యాల యాదయ్య, మైనోద్దీన్ పాల్గొన్నారు.