మెదక్

ప్రాజెక్టు నిర్మాణానికి విధివిధానాలు..పర్యావరణ అనుమతులు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూన్ 10: పర్యావరణ అనుమతి పొంది విధివిధానాలు ప్రకటించాలని, ప్రజాభిప్రాయం మేరకు ప్రాజెక్టు నిర్మించాలని, అలాకాకుండా ఇష్టారీతిగా ప్రాజెక్టులు నిర్మించాలనుకోవడం చట్ట వ్యతిరేకమని సిపిఎం జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండలంలోని వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామాల్లో మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడాలేని విధంగా భూసేకరణకు కేంద్రం చేసిన చట్టం కాదని జిఓలతో సేకరించడం దారుణమన్నారు. 2013లో యూపిఏ ప్రభుత్వం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భూ సేకరణ చట్టం తెచ్చిందన్నారు. చట్టంకు లోబడి ఏ జిఓ ఐనా ఉండాలని, చట్ట బద్దతలేని 123జిఓతో ప్రభుత్వం భూసేకరణ చేయడం సరికాదన్నారు. ప్రజల అభిష్టానికి అనుగుణంగా ప్రాజెక్టల నిర్మాణం, భూసేకరణ, పరిహారం చెల్లింపులు ఉండాలని చట్టంలో ఉందని, చట్టంను కాదని జిఓను అమలు చేయడంలో ఆంతర్యమేందన్నారు. కాంట్రాక్టర్లకు మేలు జరిగేలా రీడిజైన్‌ల పేరుతో ప్రాజెక్టుల సామర్థ్యం పెంచి పచ్చని భూములను ముంపుకు గురి చేస్తుందన్నారు. ప్రజలు ఆందోళన చెందుతున్నా సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావులు నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇంజనీరింగ్ నిపుణులు సైతం 50టిఎంసిల ప్రాజెక్టు కాకుండా తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు చేస్తే 25కోట్లు ఆదా అవుతుందని, ఆదిలాబాద్ జిల్లాకు కూడా సాగునీరు అందించే అవకాశాలు ఉంటాయన్నారు. దాన్ని కాదని పచ్చని భూములున్న గ్రామాలను ముంపుకుగురి చేసి ప్రజలను భయాందోళనకు గురి చేయడం శోచనీయమన్నారు. 50టిఎంసిలు కాకుండా చిన్న రిజర్వాయర్లు నిర్మించి ముంపు తగ్గించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు తప్పనిసరైతే 2013చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. సిఎంకు భూముల ధరలు తెలుసని, 5,6లక్షలకు ఎకరం భూమి వస్తుందా అని ప్రశ్నించారు. మార్కెట్ ధరకు అనుగుణంగా 4రేట్ల పరిహారం చెల్లించాలన్నారు. రాష్ట్రం సాధించుకున్న ఆనందం ఈ గ్రామాల్లో కనిపించడం లేదని, బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు దుఃఖం మిగిల్చడం సరికాదన్నారు.
ప్రగతి అంటే ముంపునకు గురిచేయడమేనా?
తెలంగాణ వస్తే ప్రజలు బాగుపడుతారన్న కెసిఆర్ ముంపు గ్రామాల ప్రజల సంగతి ఏందని వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధ్యక్షుడు శ్రీ్ధర్‌రెడ్డి విమర్శించారు. భూనిర్వాసితులు నెలలకొద్ది ఆందోళన చేస్తున్నా వారిగోడు పట్టకపోవడం దారుణమన్నారు. అనవసరంగా 50 టిఎంసిలు నిర్మించి గ్రామం ముంచకుండా చిన్న రిజర్వాయర్లు నిర్మించి కాల్వలద్వారా నీరందించాలన్నారు. కాగా పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగరావు, జయరాజ్, భాస్కర్, కిష్టయ్య, సర్పంచులు సునందబాయి, మంజుల, మల్లేశం, కిష్టయ్య, రమేశ్, మోహన్‌రావు, రంగారెడ్డి,ప్రశాంత్, ప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.