మెదక్

ఆన్‌లైన్ మోసంతో అవాక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దశంకరంపేట, జూన్ 10: బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నానని, మీ అకౌంట్ నిలిపివేయబడుతుందని, వెంటనే మీ ఎటిఎం నంబర్ చెబితే అకౌంట్‌ను పునరుద్ధరిస్తామని పేర్కొంటూ ఫోన్‌చేసిన ఆగంతకులు పెద్దశంకరంపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులను బురిడీ కొట్టించారు. ఇద్దరి అకౌంట్ల నుంచి రూ.35 వేలు తస్కరించారు. వివరాల్లోకి వెళితే.. ఈ వ్యవహారంలో పెద్దశంకరంపేట మండలానికి చెందిన సుభాష్ అనే ఉపాధ్యాయుడు రూ.25 వేలు నష్టపోగా, ఏకె పౌల్ అనే ఆర్టీసీ డ్రైవర్ రూ.9,700 నష్టపోయారు. గురువారం సాయంత్రం వీరి మోబైల్ నంబర్‌కు ఫొన్ చేసిన ఆగంతకుడు తాను ఎస్‌బిహెచ్ మేనేజర్‌గా పరించయం చేసుకున్నాడు. మీ ఖాతాలో లొసుగులున్నాయని అందువల్ల ఖాతాలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టవలసి వస్తోందని నమ్మబలకడంతో ఇరువురూ అలా చేయవద్దంటూ ఫొన్‌లో ప్రాధేయపడ్డారు. అలా అయితే మీ ఎటిఎం కార్డుపై ఉన్న నంబర్లను చెప్పమని అడిగగా వీరికి అనుమానం వచ్చి చెప్పలేదు. కానీ సదరు వ్యక్తి ఎటిఎం కార్డుపై ఉన్న ముందు వెనుక నంబర్ చెప్పి నేను అధికారిని కానట్లయితే మీ కార్డుపై ఉన్న నంబర్ ఎలా చెబుతున్నానని చెప్పడంతో ఇరువురు ఎటిఎం కార్డు నంబర్ పూర్తిగా తెలిపారు. సదరు వ్యక్తి మీ ఫొన్‌కు ఒటిసి మెసేజ్ వస్తుందని, రాగానే ఆ మెసేజ్ నంబర్ చెప్పాలని చెప్పాడు. సదరు వ్యక్తి చెప్పినట్టుగానే మెసేజ్ రావడం, వెంటనే వీరు ఆ వ్యక్తికి నంబర్ చెప్పడంతో వీరి ఖాతాలోని డబ్బు ఆన్‌లైన్‌లో వెళ్లిపోయింది. వీరికి అనుమానం వచ్చి బ్యాంక్‌కు వెళ్లి చూడగా వీరి డబ్బు ముంబాయిలోని ఒక టివి షాపులో వస్తువులు కొనుగోలు చేసినందున అక్కడికి ట్రాన్స్‌అయినట్లు తెలియడంతో వారు లబోదిబోమన్నారు. ఇలాంటి ఆగంతకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఫోన్ చేసి ఎవరైనా కార్డు నంబర్ అడిగితే చెప్పవద్దని స్థానిక ఎస్సై శ్రీ్ధర్, బ్యాంక్ మేనేజర్ కృష్ణప్రసాద్‌లు హెచ్చరించారు.