మెదక్

ఖరీఫ్‌కు రాయితీపై ఎరువులు, విత్తనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 10: జిల్లాలో ఖరీఫ్ సాగుకు గాను అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రాయితీపై సరఫరా చేసేందుకు తగు చర్యలు చేపట్టడం జరిగిందని వ్యవసాయ శాఖ జెడి మాధవి శ్రీలత తెలిపారు. మండలాల్లోని ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా గుర్తించిన డీలర్లతో ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. కావాల్సిన పంట విత్తనాలను వ్యవసాయ అధికారులను సంప్రదించి పొందాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలు, నకిలీ కంపెనీలు, అనాధికార వ్యక్తులు గ్రామాల్లో ఎరువులు నిలువచేస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఇందుకు గాను జిల్లా మానిటరింగ్ కిమిటీని నియమించడం జరిగిందన్నారు. సంగారెడ్డికి జిఎం నివేదిత (ఎడిఎ) ఫోన్ నంబర్ 7288894403, నారాయణఖేడ్‌కు ఎంజి శ్రీనివాస్‌ప్రసాద్ (ఎడిఎ) ఫోన్ నంబర్ 7288894431, జిన్నారంకు ఎఓ సోలమన్ నాయక్ ఫోన్ నంబరం 7288894425కి సమాచారం అందించాలని కోరారు. డీలర్ల వద్ద విత్తనాలు పొందిన రైతులు తప్పని సరిగా రశీదు పొందాలని సూచించారు.