మెదక్

జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీ విజేత గజ్వేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూన్ 13: మెదక్ గుల్షన్ క్లబ్‌లో మెదక్ ద్వారకా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌లో గజ్వేల్ టీమ్ మొదటి స్థానంలో గెలుపొందింది. రెండవ స్థానంలో మిరుదొడ్డి నిలిచింది. అంతకు ముందు సెమీ ఫైనల్ వాలీబాల్ మ్యాచ్‌లో పాపన్నపేట, మిరుదొడ్డి తలపడ్డాయి. మరో మ్యాచ్‌లో మెదక్ గజ్వెల్ తలపడ్డాయి. మెదక్‌పై గజ్వేల్ గెలుపొందగా, పాపన్నపేటపై మిరుదొడ్డి గెలుపొందింది. గెలిచిన గజ్వేల్-మిరుదొడ్డి మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా కొనసాగింది. ఇందులో గజ్వేల్ టోర్నమెంట్ విజేతగా నిలువగా రెండవ స్థానంలో మిరుదొడ్డి నిలిచింది. ఈ వాలీబాల్ టోర్నమెంట్‌లో మొదటి స్థానంలో గెలిచిన గజ్వేల్ టీమ్‌కు ఐదు వేల రుపాయల నగదు పారితోషికాన్ని మెదక్ సిఐ సాయి ఈశ్వర్‌గౌడ్, రూరల్ సిఐ రామకృష్ణ అందజేశారు. రెండవ స్థానంలో గెలుపొందిన మిరుదొడ్డి టీమ్‌కు మూడు వేల రుపాయలు పోలీస్ అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుల్షన్ క్లబ్ సెక్రటరి చింతల సుభాష్, ద్వారకా చారిటబుల్ ప్రతినిధులు బలరాం, మహేందర్‌రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు దేవరాజ్, రవి, శ్రీ్ధర్, ఫయాజ్, శివశంకర్, సురేష్, రవిందర్, నరేష్, వినోద్, గోపాల్ పాల్గొన్నారు. మొదటి బహుమతి గెలుపొందిన గజ్వెల్ జట్టులో కెప్టెన్ స్వామి, సంతోష్, ఫయాజ్, ఇర్పాన్ ఉన్నారు.