మెదక్

ఇంటింటికీ ‘దీపం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూన్ 13: తెలంగాణ ప్రభుత్వంలో పొగచూరే పొయ్యిలు ఉండవు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కృషితో ప్రతి పేద కుటుంబానికీ గ్యాస్ పొయ్యిలు ఇస్తున్నట్లు శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం నాడు మెదక్ పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన గ్యాస్ పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గ్యాస్ కనెక్షన్ లేని వారికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మెదక్ పట్టణంలో 6 వేల మంది నిరుపేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరైనట్లు పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. మరో 10 వేల కనెక్షన్లకు ప్రతిపాదనలు పంపినట్లు ఆమె తెలిపారు. ఒకే ఇంట్లో కొడుకులు వేరుపడితే వారి కుటుంబాలకు మహిళల పేరుమీద గ్యాస్ కనెక్షన్లు మంజూరు ఇస్తామని పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబం సంతోషంగా జీవించాలన్నదే కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆమె తెలిపారు. పేదవారందరూ కూడు, గూడు, గుడ్డ అనే మూడు అంశాలలో సంతోషంగా జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. అన్ని వర్గాలలో నిరుపేదలుగా జీవిస్తున్నావారందరికీ ఈ ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తాయని ఆమె వెల్లడించారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ అన్ని వర్గాలలోని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం వర్తింపజేసే విధంగా కల్పించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రాబోయే మార్చి నాటికి వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఏ మహిళ కూడా మంచినీటి కోసం రోడ్డు ఎక్కకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకాన్ని కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ పథకం అమలుకాకపోతే 2019 నాటికి జరిగే ఎన్నికల్లో ఓట్లు అడగమని కెసిఆర్ వెల్లడించిన విషయాన్ని పద్మాదేవేందర్‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర పురపాలక సంఘం మంత్రి కెటిఆర్ తలపెట్టిన పథకంలో భాగంగా పట్టణాల్లో ఒక్క రుపాయికే నల్లా కనెక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయని ఆమె తెలిపారు. ఈ నల్లా కనెక్షన్‌లన్నీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇస్తున్నట్లు తెలిపారు. సీనియర్ స్వయం సహాయక గ్రూప్‌లకు రూ.10 లక్షల రుణాలు ఇస్తున్నట్లు కూడా ఆమె తెలిపారు. మహిళా గ్రూప్‌లకు భవన సముదాయాలు ప్రభుత్వం నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ సీజన్‌లో హరితహారంలో ఇంటింటికీ ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కౌన్సిలర్లు హరితహారం విషయంలో ఎవరి వార్డులో వారు మొక్కలు అధికంగా నాటే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. పచ్చని మెదక్ పట్టణంగా కౌన్సిలర్లు తీర్చిదిద్దాలన్నారు. ఇందులో పండ్ల మొక్కలు కూడా ఫారెస్ట్ అధికారులు పంపిణీ చేస్తారని తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రం సిఎం ఆశీర్వాదంతో ఏర్పడిందని ఆమె తెలిపారు. జిల్లా కేంద్రంకు అవసరమైన సహకారం అందరు అందజేయాలన్నారు. మెదక్ పట్టణం స్వచ్చ మెదక్‌గా తీర్చిదిద్దాలని ఆమె పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలో రోడ్డు ఇరువైపుల డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం 52 కోట్లు మంజూరు చేసినట్లు పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. మెదక్ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన డంప్‌యార్డులో ఐటిసి వారు చెత్తను ఖరీదు చేస్తున్నారు, మున్సిపల్ అధికారులు వర్మి కాంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నారు. అంటే మెదక్ పట్టణానికి ఆదాయ వనరులు సమకూర్చుకుంటున్నారని ఆమె తెలిపారు. పారిశుద్ధ్యం విషయంలో ప్రజలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ అధ్యక్షత వహించారు. మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్, తహశీల్దార్ అమినోద్దీన్, వైస్ చైర్మన్ రాగి అశోక్, పిఆర్‌పి సునీత, కౌన్సిలర్లు అనిల్‌కుమార్, ఎండి సలామ్, మొంగని విజయలక్ష్మీ, అమినాబేగం, మాయ మల్లేశం, గడ్డమీది యశోద, ఐతారం నర్సింలు, సులోచన, గూడూరి అనుషా, అంకం చంద్రకళ, బట్టి సులోచన, దొంతి లక్ష్మీ, గోదల జ్యోతి, ధర్మకారి రాధ గోవింద్, ఏనుగుల యశోద, కెశమ్మ తదితరులు పాల్గొన్నారు.