మెదక్

ఇష్టారీతిలో వ్యవహరిస్తే గుణపాఠం తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూన్ 14: ఉప ఎన్నికల్లో గెలుపుతో ప్రభుత్వం ఇష్టారీతిగా ప్రవర్తిస్తు ప్రజలను ఇబ్బందులు పెడుతుందని మాజీ విప్ జగ్గారెడ్డి ఆరోపించారు. మంగళవారం మెదక్ జిల్లా తొగుట మండలం వేములఘాట్, ఏటిడిగడ్డకిష్టాపూర్‌లో మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన రిలేదీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ సర్కార్ ప్రజలకు ఒరగపెట్టిందేమి లేదన్నారు. సాగునీరు అందించే పేరుతోపచ్చని భూములు ముంపుకు గురి చేసి రైతుల పొట్టకొట్టే పనులు చేస్తున్నారన్నారు. అవసరం లేకున్నా ఇష్టారీతిగా 50టిఎంసిలకు పెంచడం దారుణమని, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు చేపడితే సహించేది లేదన్నారు. 14గ్రామాల ప్రజలకు న్యాయం చేసేందుకు సిఎం ఫాంహౌస్‌ను సైతం దిగ్బంధిస్తామని హెచ్చరించారు. హైవేను దిగ్బంధించి సిఎం, మంత్రులను జిల్లాకు రాకుండా చేస్తామన్నారు. ప్రజలు న్యాయం కోసం ఆందోళన చేస్తుంటే పోలీసులతో కేసులు పెడితే వెనుకడుగు వేస్తారని, అప్పుడు భూములు సులభంగా తీసుకోవచ్చనే ఆలోచన సాధ్యం కాదన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలకులు నచుకోకుంటే తగిన బుద్ది తప్పదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలాంటిది జరిగేది కాదన్నారు. కేసులెన్ని పెట్టినా మీవెంట ఉండి న్యాయం జరిగే వరకు ఆందోళనలు చేస్తామన్నారు.
ప్రజల హక్కులకు భంగం కలిగించే అధికారం ఎవరికి లేదు
హైకోర్టు న్యాయవాది కెకె. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పౌరహక్కులకు భంగం కలిగించే అధికారం ఎవరికీ లేదన్నారు. అధికారులకు సైతం బాధ్యతలు ఉంటాయని, వాటిని విస్మరిస్తే వారికి సైతం చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. 2013లో యూపిఏ ప్రభుత్వం భూసేకరణ చట్టం తెచ్చిందన్నారు. భూసేకరణతో సంస్కృతి, సంప్రదాయాలు, ఉద్యోగాలు తదితర ఆంశాలకు విఘాతం కలుగకుండా ఈ చట్టం రూపొందించారన్నారు. గ్రామాల్లో సభలు నిర్వహించి 60రోజుల్లో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా భూసేకరించాలన్నారు. ప్రజలకు, పర్యావరణానికి నష్టం జరిగినా ఉపసంహరించుకోవాలన్నారు. భూమి కోల్పోతే తల్లిని కోల్పోయినట్లేనని, ప్రతి రైతు ఘోషిస్తాడన్నారు. భూసేకరణతో మానవ సంబంధాలు సైతం చిన్నాభిన్నమైతాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని 2013చట్టం రూపొందించారన్నారు. చట్టంను కాదని 123జిఓ అమలు చేయాలనుకోవడం హక్కులను కాలరాయడమేనని న్యాయవాది హర్షవర్దన్‌రెడ్డి అన్నారు. సమన్యాయం చేసేందుకు 2013చట్టం రూపొందించారన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రజలకు భూసేకరణ చట్టం, జిఓ 123, హక్కులు, బాధ్యతల పై అవగాహన కల్పించారు. 123 జిఓతో కలిగే నష్టం, చట్టంతో కలిగే మేలు కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రాజెక్టుకు నిరసనగా గ్రామంలో ర్యాలీ తీశారు. ఇంకా ఈ సమావేశంలో పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, నేతలు పవన్‌కుమార్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ అనంతకిషన్, శ్రీనివాస్‌గౌడ్, రాంరెడ్డి, లక్ష్మణ్‌గౌడ్, అత్తు, రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.