మెదక్

13కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో.. సమీకృత మార్కెట్ యార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 16 : సిద్దిపేట సమీకృత మార్కెట్‌యార్డును 13 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు. మెదక్ జిల్లా సిద్దిపేట సమీకృత మార్కెట్‌యార్డు నిర్మాణ పనులను మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. మార్కెట్ యార్డు నమునా చిత్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమీకృత వెజ్, నాన్ వేజ్, ఫ్రూట్ యార్డును అన్ని వౌలిక సదుపాయాలతో నిర్మించనున్నట్లు తెలిపారు. 3 కోట్ల రూపాయలతో విక్టరీ చౌరస్తాలోని రైతుబజార్‌ను ఆధునీకరించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మంచిగా నడుస్తున్న రైతుబజార్లలో సిద్దిపేట ఒకటన్నారు. రైతు బజార్‌లో 800 మంది రైతులు తాము పండించిన కూరగాయలు విక్రయిస్తుండగా నిత్యం 5,6 వేలకు పైగా క్రయ విక్రయాలు జరుగుతాయన్నారు. పార్కింగ్ సదుపాయం లేకపోవటం వల్ల రైతు బజార్ చిన్నదిగా ఉండటం వల్ల రైతుబజార్‌కు వచ్చి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నట్లు తెలిపారు. 3కోట్ల రూపాయలతో సెల్లార్ మూడు అంతస్తుల వరకు రైతుబజార్‌ను ఆధురీకరించనున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నారు. మూడు నెలల్లో రైతుబజార్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మూడు నెలల్లో పూర్తి చేసిన కంట్రాక్టర్లకు 1 శాతం ఇన్స్‌ంటివ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డు గోదాం నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. చిన్నకోడూరు మార్కెట్ యార్డు నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సమీకృత మార్కెట్ యార్డులోని అంబేద్కర్, నర్సాపూర్, శంకర్‌నగర్, హనుమాన్ ప్రాంతాల కోసం మరో రైతుబజార్ నిర్మించనున్నట్లు తెలిపారు.
మార్కెటింగ్ డిఇపై మంత్రి ఆగ్రహం
గజ్వేల్ లోని మార్కెట్ యార్డు గోదాం పనుల జాప్యంపై మంత్రి హరీష్‌రావు మార్కెటింగ్ డిఇ శ్రీనివాస్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ యార్డులోని ఆర్చ్ నిర్మాణం, గోదాంల నిర్మాణం ఏప్పుడు పూర్తి చేస్తావని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించగా మరో వారం రోజులు గడువు కావాలని సమాధానం ఇచ్చారు. ఇప్పటి ఎన్నో సార్లు వారం రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పావని మంత్రి డిఇపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులన్నీ నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈకార్యక్రమంలో మార్కెటింగ్ ఎస్‌ఇ నాగేశ్వర్‌రెడ్డి, డిఇ శ్రీనివాస్‌రావు, ఎఇ ఆకుల మహేందర్, కార్యదర్శి శ్రీనివాస్, పరమేశ్వర్, ఎంపిపిలు కూర మాణిక్యారెడ్డి, యాదగిరి, నాయకులు అత్తర్‌పటేల్, రాధకిషన్‌శర్మ, గ్యాదరి రవీందర్, మల్యాల బాలరాజు, బర్ల మల్లికార్జున్, నయ్యర్‌పటేల్, సాకి ఆనంద్, బ్రహ్మం, శ్రీనివాస్‌గౌడ్, సత్తయ్య, నాగరాజు పాల్గొన్నారు.