మెదక్

రెండు లారీలు ఢీ: డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట, జూన్ 17: నత్తనడకన సాగుతున్న రోడ్డు విస్తరణ పనులతో మరో ప్రమాదానికి కారణం కావడంతో ఓ డ్రైవర్ నిండు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సదాశివపేట మండలం ఆరూర్ గ్రామ శివారులో 165వ నంబరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ బానుప్రసాద్ మృతి చెందాడు. ముంబాయి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎంహెచ్ 46 హెచ్ 5856 ట్రక్కును సదాశివపేట నుంచి జహీరాబాద్‌కు వెళుతున్న ఎపి 09 సి 5156 నంబరు గల టిప్పరు ఢీ కొట్టింది.
ఈ సంఘటనలో ట్రక్కు డ్రైవర్ బానుప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ మల్కయ్య గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. మృతదేహాన్ని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. కాగా 165వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో పనుల కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూ అనేక మంది మృత్యువాత పడుతున్నా యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని వాహన చోదకులు, మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరూర్, గంగకత్వ ప్రాంతాల్లో రోడ్డు డైవర్స్ చేసిన చోట్ల సరియైన సూచికలు లేకపోవడంతో ఈ ప్రమాదాలకు కారణమని స్పష్టమవుతోంది.