మెదక్

మత్తుపదార్ధాల కేసులో.. నిందితుడికి పదేళ్ల జైలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మార్చి 18: 18 కిలోల అప్రాజోలం పట్టివేత కేసులో ముద్దాయి క్రిష్టాగౌడ్‌కు లక్ష రుపాయల జరిమాన, 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు మెదక్ స్టేషన్ ఎక్సైజ్ సిఐ బి.ప్రభావతి శుక్రవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ జడ్జి ఎ.్భరతి, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ తరపున వాధించిన మొదటి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె.శ్రీనివాస్‌రెడ్డి వాదనల అనంతరం ముద్దాయి మడూరి క్రిష్ణాగౌడ్‌కు ఈ శిక్ష విధిస్తూ శుక్రవారం నాడు డిస్ట్రిక్ సెషన్ జడ్జి భారతి తీర్పునిచ్చారు. మెదక్ ఎక్సైజ్ స్టేషన్‌లో ఇలాంటి శిక్ష చరిత్రలోనే లేదని ప్రభావతి తెలిపారు. కాబట్టి ఇలాంటి మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలు ఎవరైనా జరిపితే వారికి కూడా ఇలాంటి కఠిన శిక్షలకు గురవుతున్నారని ఎక్సైజ్ సిఐ ప్రభావతి హెచ్చరించారు.