మెదక్

బ్యాంక్ ఉద్యోగినంటూ.. నగదు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, జూన్ 17: బ్యాంక్ ఉద్యోగినంటూ బ్యాంకులో డబ్బులు వేయడానికి వచ్చిన ఓ ఖాతాదారుని వద్ద డబ్బులు దోచుకెళ్లిన సంఘటన గురువారం ములుగు ఎస్‌బిఐ బ్యాంక్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబందించి బాదితుడు సత్యనారాయణ అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలపరిదిలోని భవానందాపూర్ గ్రామానికి చెందిన కొండి సత్యనారాయణ కూరగాయలు రవాణా చేయడానికి గత కొద్దిరోజుల క్రితం కాకినాడలో ఓ వాహనాన్ని కొనుగోలు చేసి కొంత మొత్తాన్ని చెల్లించాడు. మిగితా డబ్బులతో చెక్కు ఇచ్చి వచ్చాడు. గడువు దగ్గర పడడంతో ములుగు ఎస్‌బిఐలో తన అకౌంట్‌లో డబ్బులు వేయడానికి లక్ష 24 వేల 500 రూపాయలకు ఓచర్ రాయడానికి ప్రయత్నిస్తుండగా బ్యాంకు ఉద్యోగినంటూ ఓ వ్యక్తి తనను పరిచయం చేసుకొని సాయం చేస్తానని చెప్పాడు. అనంతరం మేనేజర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చి సత్యనారాయణను పాన్‌కార్డ్ కావాలని చెప్పగా అది ఇంటి వద్ద ఉన్నదని తెలుపడంతో దీనిని ఆసరా చేసుకున్న దొంగ పోస్ట్‌ఆఫీస్‌లో ఎఎల్‌అర్ నంబర్ తీసుకువస్తే అకౌంట్‌లో డబ్బులు వేయవచ్చని చెప్పాడు. అయితే బాదితుడు బ్యాంక్ ఉద్యోగేనని నమ్మి మొత్తం డబ్బును అతనికి ఇచ్చి పోస్ట్‌ఆఫీస్ వద్దకు వెళ్లొచ్చాడు. అనంతరం బ్యాంక్‌లో అతను కనిపించకపోగా మోసపోయానని బావించి ములుగు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఎస్‌ఐ శ్రీశైలం సిసి పుటేజిలను పరిశీలించి వాటి ఆదారంగా నిందితున్ని పట్టుకొని న్యాయం చేస్తానని తెలిపారు.ములుగు ఎస్‌బిఐ మెనెజర్ సిందూర మాట్లాడుతూ ఖాతాదారులు ఎవరినీ నమ్మి మోసపోవద్దని బ్యాంక్‌లో మీకు మేము అందుబాటులో ఉంటామని కాబట్టి ఏ సహాయం కావాలన్నా మా సిబ్బందిని మాత్రమే సంప్రదించాలని సూచించారు. బ్యాంక్ ఆవరణలో అనుమానంగా ఎవరు కనిపించినా మాకు వెంటనే ఫిర్యాదు చేసి మా సహాయం పొందాలని సూచించారు.