మెదక్

అంతటా ఆనంద యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 21: యాంత్రిక జీవన విధానం, విశ్రాంతి లేని పని భారం, కాలుష్యమైన వాయువు, పౌష్టికత లేని ఆహారం ఇత్యాది కారణాలతో చికిత్సలు లేని రోగాల భారీన పడుతున్న వారికి దివ్య ఔషదంగా మారిన యోగాసనాలకు మంచి స్పందన లభిస్తోంది. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా అంతటా యోగా కార్యక్రమాలను ఉత్సాహంగా, ఉల్లాసంగా నిర్వహించారు. ఉదయం నుంచే పలు పట్టణాలు, పెద్ద పెద్ద గ్రామాల్లో యోగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రపంచ యోగా దినోత్సవంపై విస్తృతమైన ప్రచారం, ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలు వెలువడటంతో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు, వృద్ధులు, మహిళలు అంతా స్వచ్చందంగా తరలి వచ్చారు. జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలు, రెండు జిహెచ్‌ఎంసి కార్పొరేషన్లు, మేజర్ గ్రామ పంచాయతీల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు పీఠాధిపతుల నేతృత్వంలో కొనసాగుతున్న ఆశ్రమాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. వరుస క్రమాల్లో కూర్చుండి యోగా గురువులు చెప్పిన విధంగా హాసనాలు వేయడంతో విన్యాసాలను తలపింపజేసాయి. కాగా ఈ కార్యక్రమం ద్వారా యోగాపై అన్ని వర్గాల్లో మరింత ఆసక్తి పెంపొందించే అవకాశం ఉంటుందని నిర్వాహకులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని పిఎస్‌ఆర్ గార్డెన్‌లో యోగా దినోత్సవాన్ని ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి శాసన సభ్యులు చింతా ప్రభాకర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగా వల్ల మానసిక ప్రశాంతం, శారీరక అలసట తీరుతుందని అన్నారు. ప్రతి రోజు యోగాసనాలు చేయడం వల్ల రోగాలు దూరమవుతాయన్నారు. యావత్ ప్రపంచానికే యోగా ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. పతంజలి సంస్థ ప్రతినిధి శివరాంసింగ్ మాట్లాడుతూ సప్త రుషులకు శివుడు యోగా నేర్పించాడని, ఇది రుగ్వేద కాలం నాటిదన్నారు. మధుమేహసం, హైపర్ టెన్షన్, ఉదర సంబంధ వ్యాధులతో పాటు మెడక, కండరాలు, నరాల బలహీనత, జీర్ణశక్తి, చురుకుదనం లభిస్తుందన్నారు. పిల్లలకు జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాకుండా శారీరక పటుత్వం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ నోడల్ అధికారి డాక్టర్ నర్సింలు, హోమియోపతి సీనియర్ అధికారి వేణు సుకుమార్, యునాని ఎండి వసుందర, హోమియో ఎండి డాక్టర్ బాలాజి, సిడిసి చైర్మన్ విజయేందర్‌రెడ్డి, సర్పంచ్ సుమంగలి చంద్రశేఖర్, బిజెపి జిల్లా అధ్యక్షులు బుచ్చిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.