మెదక్

పాపం రైతు బిడ్డలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, జూన్ 21: విద్యుదాఘాతంతో గిరిజన రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని షమ్నాపూర్ పంచాయతీ పరిధిలో కొచ్చెరుతండాలో మంగళవారం చోటుచేసుకుంది. మెదక్ రూరల్ ఎస్‌ఐ సంతోష్‌కుమార్ కథనం ప్రకారం తండాకు చెందిన యుడావత్ శివుల (40) ఉదయం ఇంటి సమీపంలో గల వ్యవసాయ భూమిలో బోరు ఆన్‌చేయడానికి వెళ్లగా స్టార్టర్ ప్యానెల్ బోర్డు వద్ద షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని బర్య శోభ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించింది. ముగ్గురు పిల్లలు నవీన్, కుమార్, నందినిలున్నారు. తల్లిదండ్రులు మృతిచెందడంతో పిల్లలు అనాథలయ్యారు. కేసు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.
బాధిత కుటుంబానికి మంత్రి ఆర్థిక సాయం
నంగునూరు, జూన్ 21: మండలంలోని అంక్షాపూర్‌కు చెందిన పిల్లి నర్సింలు అనారోగ్యంతో మృతి చెందగా మంత్రి హరీష్‌రావు అందించిన ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి మంగళవారం టిఆర్‌ఎస్‌వి నేత శ్రీనివాస్‌గౌడ్ అందించారు. పేదరికంతో అల్లాడుతున్న నర్సింలు మెరుగైన వైద్యం చేయించుకోలేక మంగళవారం మృతి చెందాడు. ఈ విషయం మంత్రి దృష్టికి తీసుకపోగా 3వేల ఆర్థిక సాయం అందించారు.
ప్రపంచానికే సంస్కృతి నేర్పిన భారత్
* బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు
దుబ్బాక, జూన్ 21: ప్రపంచానికే సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పిన భారత్ గొప్ప దేశమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం దుబ్బాక బాలాజీగార్డెన్‌లో విద్యార్థులకు యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను అన్ని దేశాలు గౌరవిస్తున్నాయన్నారు. యోగాకు భారత్ పుట్టినిళ్లు కావడం గర్వకారణమన్నారు. ప్రపంచ దేశాలన్నీ యోగాను అనుసరిస్తున్నాయని, దీన్ని గుర్తించి మనమంతా యోగాను నేర్చుకోవాలన్నారు. యోగాతో శారీరక ధారుడ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా యోగాగురువు యోగాతో కలిగే లాభాలను విద్యార్థులకు వివరించారు. కమిషనర్ భోగేశ్వర్, బిజెపి నేతలు బాలేష్‌గౌడ్, వంశీకృష్ణ, చిన్నికృష్ణాగౌడ్, రాజు, భూపతి, రాజిరెడ్డి పాల్గొన్నారు.