మెదక్

నేడు బిజెపి జిల్లా కార్యవర్గ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 26: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఈ నెల 27న తూఫ్రాన్‌లోని లక్ష్మి నర్సింహ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు కాసాల బుచ్చిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి రాష్ట్ర నాయకులు కిషన్‌రెడ్డి, శ్రీనివాస్, జిల్లా ఇన్‌చార్జ్ మనోహర్‌రెడ్డిలు హాజరవుతున్నట్లు తెలిపారు.
ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
తొగుట, జూన్ 26: ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని మల్లన్నసాగర్ జెఎసి డిమాండ్ చేసింది. ఆదివారం ఏటిగడ్డకిష్టాపూర్‌లో నిర్వాసిత గ్రామస్తులతో కలిసి సమావేశం నిర్వహించి సిఎం కెసిఆర్ భూసేకరణ విషయం పై నిర్వాసితులు నిర్ణయించుకోమనడాన్ని జెఎసి ఆహ్వానించింది. ఈ నిర్ణయం పట్ల సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అఖిలపక్షంలో ప్రాజెక్టు అనివార్యమైతే 2013చట్టం ద్వారా భూసేకరణ చేయాలని, భూమి ఓపెన్ మార్కెట్ విలువ, గృహనిర్మాణానికి సంబంధించి అఖిలపక్షంతో చర్చించి నిర్ణయాన్ని వెల్లడించాలని కోరింది. అలాగే బలవంతపు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోరారు.