మెదక్

న్యాయాధికారుల ఆందోళనకు లాయర్ల మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూన్ 26: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినప్పటికినీ హైకోర్టు విభజన విషయంలో అంతిమ తీర్పు రాకపోవడం పట్ల తెలంగాణ జడ్జీలు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం నాడు గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామా చేయడానికి సిద్ధమైన జడ్జీలను పోలీసులు అడ్డుకోవడాన్ని మెదక్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌కుమార్, శ్రీపతిరావు, వినోద్, వినోద్‌కుమార్‌లు ఖండించారు. ఆదివారం మెదక్ బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ జడ్జీలకు కూడా గవర్నర్‌ను కలిసేందుకు పోలీసులు అవకాశం కల్పించకపోవడం పట్ల దురదృష్టకరంగా భావిస్తున్నామని వారు తెలిపారు. ఆంధ్ర జడ్జీల పెత్తనం తెలంగాణలో ఇంకా కొనసాగుతుందని లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. తెలంగాణలో తెలంగాణ జడ్జీలు మాత్రమే ఉండాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ, ఎపి విడిపోయిన తరువాత ఎవరి రాష్ట్రాల్లో వారు ఉద్యోగాలు అనుభవించడానికి అవకాశం ప్రభుత్వాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కాగా ఇప్పటికైనా హైకోర్టును విభజించి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్మణ్‌కుమార్, శ్రీపతిరావు, వినోద్, వినోద్‌కుమార్‌లు డిమాండ్ చేశారు. తెలంగాణ జడ్జీలకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు మెదక్ బార్ అసోసియేషన్ వెల్లడించింది.