మెదక్

నేటి నుంచి టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: యేడాది కాలంగా రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడిన పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులు మరికొద్ది గంటల్లో తమ భవిషత్ చదువులకు అసలు పరీక్షను ఎదుర్కోబోతున్నారు. 2015-16 విద్యా సంవత్సరానికిగాను జిల్లాలో మొత్తం 44420 మంది విద్యార్థులతో పాటు గతంలో పెయిల్ అయిన విద్యార్థులతో 46 వేలపైచీలుకు మంది పరీక్షలకు హాజరుకానున్నారని విద్యాశాఖ అధికారి నజిమోద్దీన్ వెల్లడించారు. మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు నిర్ణిత సమయానికి ఆలస్యంగా వచ్చిన వారికి ఐదు నిముషాలు మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. అయినా సమయానికి హాజరైతే విద్యార్థుల్లో మానసిక వత్తిడి తగ్గుతుందన్నారు. పరీక్షల్లో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఇతరులు వచ్చి విద్యార్థుల పరీక్ష వ్రాయకుండా భంగం కల్పించకూడదని కోరారు. పదవ తరగతి పబ్లిక్ బోర్డు ఆదేశాల మేరకు జిల్లాలోని మండల కేంద్రమైన దౌల్తాబాద్ పరీక్షా కేంద్రంలో మొట్టమొదటి సారిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసి పరీక్షలను పర్యవేక్షిస్తున్నట్లు డిఇఓ స్పష్టం చేసారు. మొత్తం 11 గదుల్లో విద్యార్థులు పరీక్షలు వ్రాయనుండగా 11 సిసి కెమెరాలు, కార్యాలయంలో మరో సిసి కెమెరాను అమర్చినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 244 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులు నేలపైకాకుండా పూర్తి స్థాయి ఫర్నీచర్‌ను సమకూర్చినట్లు వెల్లడించారు. 42 సిట్టింగ్ స్క్వాడ్, 13 ప్రత్యేక స్క్వాడ్ బృందాలతో పాటు ఇతర అధికారులు కూడా పర్యవేక్షించి మాస్‌కాఫీయింగ్‌ను నిరోధించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసామన్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలు 12.15 గంటలకు ముగింపజేస్తున్నట్లు వివరించారు. పరీక్ష సమయానికి ఒక గంట ముందు దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ నుంచి ప్రశ్న పత్రాలను తీసుకువస్తారన్నారు. త్రాగునీటి వసతి, పరీక్షా గదుల్లో వెలుతురు ఉండే విధంగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక ఎఎన్‌ఎం, మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంటారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం తహశీల్దార్లు, ఎంపిడిఓలు, ఎస్‌ఐల ఆధ్వర్యంలో వాహనాలను సిద్దంగా ఉంచి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హింది మినహా మిగిలిన ఐదు సబ్జెక్టులు మొదటి పేపర్, రెండవ పేపర్‌గా రోజుకు ఒకటి చొప్పున పరీక్షను ఎప్పటిలాగే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాసేందుకు తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు.