మెదక్

3.40కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూలై 5: ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితో హరితహారంలో పాల్గొని ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటి పర్యావణ పరిరక్షణకు పాటుపడాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పిలుపునిచ్చారు. ఈ నెల 8నుండి 22వరకు చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3కోట్ల 40లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధారించినట్లు తెలిపారు. 40వేల మొక్కలు నాటిన గ్రామ పంచాయతీలకు వివిధ అభివృద్ధి పనుల కోసం లక్ష రూపాయల పారితోషికాన్ని ప్రోత్సహకరంగా అందజేస్తామని తెలిపారు. నాటిన మొక్కలను రక్షించేందుకు హరిత రక్షణ కమిటీలను చురుకుగా పని చేయించడంతో పాటు ప్రతి వెయ్యి మొక్కలకు ఒక స్పెషల్ అధికారిని ఏర్పాటు చేసి మొక్కలను కాపాడే బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల సమిష్టి భాగస్వామ్యంతోనే అనుకున్న ఫలితాలు సాధించగలమన్నారు. గ్రామాల్లో ఇప్పటికే గుంతలు తవ్వే ప్రక్రియ ప్రారంభమైందని, కొన్ని చోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రారంభమైందన్నారు. 160 కిలో మీటర్ల మేర రోడ్లు,్భవనాల శాఖ, 1800 కిలోమీటర్ల మేర పంచాయతీ రాజ్ రోడ్ల వెంట మొక్కలు నాటేందుకు కార్యచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు అవసరమైన మొక్కలు బయట ప్రాంతాల నుండి తెప్పించేందుకు కూడా ప్రభుత్వం అనుమతించినందున అవసరమైన మొక్కలు సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలోని పరిశ్రమలకు 10లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించడం జరిగిందని, పరిశ్రమలే స్వయంగా గుంతలు తవ్వించడం, మొక్కల రవాణా బాధ్యతలు చేపట్టాలని, అవసరమున్న మొక్కలను జిల్లా యంత్రాంగం సమకూరుస్తుందన్నారు. పరిశ్రమదారులు విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యం కాపాడాలని కోరారు. గత యేడాది నాటిన కోటి 42లక్షల మొక్కలకు గాను 60నుండి 70శాతం మొక్కలు పరిరక్షించుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎజెసి వాసం వెంకటేశ్వర్లు, డిఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ ఎడి శ్రీనివాస్, బిసి సంక్షేమ శాఖ అధికారి ఆశన్న పాల్గొన్నారు.