మెదక్

హరితహారానికి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 7: పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం రెండవ విడత కార్యక్రమం జిల్లాలో మరికొద్ది గంటల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. అన్ని గ్రామాలు, పట్టణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి పది గ్రామాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు చక్కగా పని చేసే విధంగా విఆర్‌ఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా 46 మండలాల పరిధిలో మొత్తం 3.64 కోట్ల మొక్కలను నాటేందుకు కసరత్తు పూర్తిస్థాయిలో చేసారు. వ్యవసాయం, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, రెవెన్యూ, అటవి శాఖ, ఉద్యానవనం, ట్రాన్స్‌కో, ఎక్సైజ్ తదితర అన్ని శాఖల పరిధిలోని కార్యాలయాల అవరణలు, ప్రభుత్వ స్థలాలు, ప్రైవేటు స్థలాలు, పొలం గట్లు, స్మశాన వాటికలు తదితర ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించేందుకు కృషి చేయనున్నారు. విద్యార్థుల ద్వారా మొక్కలు నాటించి వారికి మొక్కలను దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తర్పీదునిచ్చారు. హరితహారంలో టేకు, వేప, కానుగ, రావి, మర్రి తదితర మొక్కలు వట వృక్షాలుగా ఎదుగేవాటితో పాటు పండ్ల మొక్కలను కూడా ఉచితంగానే అందజేయనున్నారు. ఇళ్ల ముందు తప్పనిసరిగా పండ్ల మొక్కలు నాటుకునేలా గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేస్తున్నారు. పొలం గట్ల వద్ద టేకు మొక్కలతో పాటు నీడను, కలపను ఇచ్చే వృక్షాలను పెంచడానికి అనువైన మొక్కలను నర్సరీల్లో ఉత్పత్తి చేసి సిద్ధంగా ఉంచారు. ఆశించిన ఫలితాన్ని సాధించే వరకు ప్రజలను చైతన్య పర్చడంలో హరిత రక్షణ కమిటీలు ఉత్సాహంగా పని చేసేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని కలెక్టర్ రోస్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. రోజువారిగా మొక్కలు నాటిన వివరాలు, కావల్సిన మొక్కల సమాచారాన్ని అందించడానికి ఎంపిడిఓలకు అనుకూలంగా ఉండేలా జిల్లా పరిషత్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ కేంద్రాన్ని కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రారంభించారు. 11వ తేదీన ఇక్రిశాట్‌లో లక్ష మొక్కలను నాటేందుకు అవసరమైన గుంతలు తవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. మొత్తంమీద పచ్చదనం కోసం పరితపిస్తున్న ప్రభుత్వానికి ఈ సారి హరితహారం కార్యక్రమం విజయవంతం కానుండటం తథ్యమని చెప్పవచ్చు.