మెదక్

ఘనంగా రంజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 7: రంజాన్ పర్వదిన వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రార్థన సమయం కావడంతో మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేయించి ఖురాన్‌ను పఠించారు. అనంతరం ఒకరికి ఒకరు పరస్పర శుభాకాంక్షలు అందజేసుకుని ఆలింగనం చేసుకున్నారు. వేలాది మందితో ఈద్గాలు కిటకిటలాడాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లు, ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలు, రెండు జిహెచ్‌ఎంసి కార్పొరేషన్లతో పాటు మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలు, అన్ని గ్రామాల్లో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. మహిళలు ఇళ్ల వద్దనే ఖురాన్ పఠించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సిద్దిపేటలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తీన్నరు హరీష్‌రావు, మెదక్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, జహీరాబాద్‌లో ఎంపి బిబి పాటిల్, సదాశివపేట, సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, పటన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, రామచంద్రాపూర్‌లో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, అందోల్‌లో ఎమ్మెల్యే బాబుమోహన్, దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, నర్సాపూర్‌లో జడ్పీ చైర్ పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు అందజేసారు. మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటిసిలు, ఎంపిపి అధ్యక్షులు, ఎంపిటిసిలు, సర్పంచులు, మార్కెట్ కమిటి చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులంతా ముస్లింలకు శుభాకాంక్షలు అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ఈద్గా వద్ద ఎఎస్పీ వెంకన్న, డిఎస్పీ తిరుపతన్నలతో పాటు సిఐలు, ఎస్‌ఐలు బందోబస్తును సమీక్షించారు. ఈద్గాల వద్దకు వందలాది వాహనాలపై ముస్లింలు తరలిరావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా పార్కింగ్‌లను ఏర్పాటు చేసారు. ట్రాఫిక్ జాం కాకుండా ట్రాఫిక్ పోలీసులు అన్ని చక్కబెట్టారు. ఈద్గాల నుంచి ఇళ్లకు చేరుకుని శీర్‌కుర్మాను సేవించి ఉపవాస దీక్షలను విరమించారు. అనంతరం హిందువులు, క్రైస్తవులను తమ ఇళ్లకు వింధు బోజనాలకు ఆహ్వానించి సంతృప్తి పర్చడం విశేషం. మొత్తంమీద జిల్లాలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా రంజాన్ పర్వదిన వేడుకలు ప్రశాంత వాతావరణంలో ముగియడం గమనార్హం.