మెదక్

ఇక నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జులై 10: అఖిలభారత కాంగ్రెస్‌పార్టీ పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా ఇన్‌చార్జిలను నియమించినట్లు పిసిసి సభ్యుడు సుప్రభాత రావు తెలిపారు. ఆదివారం మెదక్ రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్ జిల్లా ఇంచార్జీలుగా మాజీ ఎంపి కొండన్ ప్రభాకర్, సంతోష్‌కుమార్, జెడ్సన్‌లను నియమించారని ఆయన తెలిపారు. జెడ్సన్ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా పని చేస్తున్నట్లు సుప్రభాతరావు తెలిపారు. ఇప్పటి వరకు నర్సాపూర్, గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 14న మెదక్ సాయిబాలాజీ ఫంక్షన్ హాలులో ఉదయం 11గంటలకు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల విస్తృత స్తాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపిపిలు, మాజీ జడ్పీటిసిలు, సర్పంచ్‌లు, కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌నాయకులు, యువజన సంఘాలు, ఎన్‌ఎస్‌యుఐ సంబంధిత కాంగ్రెస్ నాయకులు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల నాటిక కాంగ్రెస్‌పార్టీని బలోపేతం చేసేందుకే కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేధాలు, లోపాలను సవరణ కూడా చేసుకుంటామని ఆయన తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన తెలిపారు. మెదక్ ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడిపించే విధంగా ఒత్తిడి తీసుకువస్తానని ఆయన తెలిపారు. ఈ నెల 14న సమావేశం అనంతరం ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమ ముందు ధర్నా చేస్తామని సుప్రభాత్‌రావు తెలిపారు. 14న జరుగు కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి మెదక్ జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలుసునీతాలక్ష్మారెడ్డి, మాజీ కాంగ్రెస్‌పార్టీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రి, జహీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్‌గీతారెడ్డి, మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రావణ్‌కుమార్, మాజీ ఎంపి సురేష్‌షెట్కార్‌లు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్‌గౌడ్, తిరుపతిరెడ్డి, శ్రీమాన్‌రెడ్డి, సిరిమల్లె శ్రీనివాస్,రమేష్‌రెడ్డి, రాంచంద్రాగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, కిషన్‌గౌడ్, తౌర్యానాయక్,అశోక్‌రెడ్డి, శంకర్, గోవింద్‌నాయక్, గొల్ల బాలయ్య పాల్గొన్నారు.