మెదక్

40 వేల మొక్కలు నాటిన గ్రామానికి రూ.లక్ష ప్రత్యేక నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నకోడూరు, జూలై 10: ఇంటింటా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని నీటి పారుదల శాఖమంత్రి హరీష్‌రావు అన్నారు. మండలంలోని పెద్దకోడూరు వద్దగల ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 40వేలకు పైగా మొక్కలు నాటిన గ్రామానికి లక్ష రూపాయల గ్రాంట్‌ను అందిస్తామన్నారు. మనిషి మనుగడకు మొక్కలు ఎంతో ఉపయోగపడుతాయని, వాటిని సంరక్షించే బాధ్యత అందరు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటడాన్ని సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు బాధ్యతగా తీసుకొని సిఎం కెసిఆర్ తలపెట్టిన హరిత తెలంగాణకు అందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, ఎంపిపి మాణిక్యరెడ్డి, జడ్పిటిసి కమల, ఎఎంసి చైర్మన్ వెంకట్‌రెడ్డి, సొసైటి చైర్మన్లు పాపయ్య, బాల్‌రెడ్డి, సర్పంచు సునిత, టిఆర్‌ఎస్ రాష్ట్ర నేత రాధాకిషన్‌శర్మ, కనకరాజు, రాంచంద్రం, శ్రీనివాస్ పాల్గొన్నారు.