మెదక్

గోదావరి నీటితో సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 14: గోదావరి నీటితో కాళేశ్వరం నీటి పథకం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ప్రతియేటా గోదావరి నీరు 1000నుంచి 4వేల టిఎంసిల వరకు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. ఇటీవల కురిసిన వానలకు వెయ్యి టిఎంసిల నీరు వృథాగా సముద్రంలో కలిసిందన్నారు. సముద్రంలో కలిసే నీటినే సద్వినియోగం చేసుకొని సిఎం కెసిఆర్ భగీరథ యత్నం చేస్తున్నాడన్నారు. జిల్లాలో సిద్దిపేట మండలం నాంచారుపల్లి, పొన్నాల హరితహారంలో మంత్రి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లాకు సాగునీరు అందించేందుకు టనె్నల్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. రంగనాయకసాగర్ నిర్మాణం కోసం 3వేల ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూరె్తైందని, సొరంగ పనులు దాదాపు పూరె్తైనాయన్నారు. 2017దసరానాటికి గోదావరి జలాలను రంగనాయక్‌సాగర్ ద్వారా అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిద్దిపేట నియోజకవర్గంను రాష్ట్రంలో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే వందశాతం మరుగుదొడ్ల, గ్యాస్, ఇంకుడుగుంతల నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో 30కోట్ల చొప్పున 3 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. సిద్దిపేటప్రాంత యువతకు ఉపాధి కోసం బిసి స్టడీ సర్కిల్ సెంటర్‌తో పాటు కొత్తగా ఎస్సీ స్టడీసెంటర్‌ను ఏర్పాటు చేశామని, పోటీ పరీక్షలకు ఎంతో దోహదం చేస్తాయన్నారు.
హరిత సిద్దిపేటను
ఉద్యమంలా చేపట్టాలి
వానలు పడి చెరువులు నిండితేనే మన బతుకులు బాగుపడుతాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇటీవల పడ్డ వానలతో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో చెరువులు నిండి అలుగు పారాయన్నారు. సిద్దిపేటలో చెరువుల్లోకి నీరు రాలేదన్నారు. ఆ ప్రాంతాల్లో అడవులు అధికంగా ఉండడం వల్లే వానలు సమృద్ధిగా పడ్డాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కింద గ్రామానికి 40వేల మొక్కలు పెంచాలన్నారు. జిల్లాలో 13లక్షల ఈతచెట్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇబ్రహీంపూర్ ఒకేరోజు లక్ష మొక్కలు పెంచి ఆదర్శంగా నిలిచిందని, కులసంఘాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచాలని సూచించారు. ప్రజలకు ఏ రకమైన చెట్టు కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న మంత్రి హరీష్‌రావు మహిళలు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపిపి యాదయ్య, వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, ఓఎస్డీ బాల్‌రాజ్, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ సమ్మిరెడ్డి, సర్పంచులు భాగ్యలక్ష్మి, రాజమణి, నాయకులు బాల్‌రంగం, శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.