మెదక్

సామాజిక దృక్పథంతోనే హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 15: కోట్లాది మొక్కలు నాటి రికార్డులు కొట్టామని చెప్పుకోవడానికి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టలేదని, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తాను, ముఖ్యమంత్రి క్షుణ్ణంగా చర్చించుకుని ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటిస్తున్నట్లు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ స్పష్టం చేసారు. సామాజిక దృక్పథంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శుక్రవారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపిలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బిబి పాటిల్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే రామలింగారెడ్డిలతో కలిసి సిద్దిపేట మండలం, పట్టణం, గజ్వేల్ నియోజకవర్గాల్లో గవర్నర్ సుడిగాలి పర్యటన చేసి మొక్కలు నాటారు. గజ్వేల్ మండలం బంగ్ల వెంకటాపూర్ గ్రామ శివారులోని అటవీ శాఖ నర్సరీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడారు. వృక్ష సంపద విపరీతంగా తరిగిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యత లోపించిందని, తద్వారా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. కాలుష్యాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాలనే ముందుచూపుతోనే ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఇలాంటి బృహత్ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో ఆలోచించకుండా అందరు సహకరించి విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఉద్బోధించారు. గ్రామాలు బాగుపడాలంటే అడవులు బాగా వృద్ది చెందాలని, అదే విధంగా నీటిని పొదుపు చేసేందుకు ఇంకుడు గుంతలను తప్పనిసరిగా తవ్వుకోవాలని, సౌర విద్యుత్‌ను వినియోగించుకోవాలని సూచించారు. చెట్టును పెంచితే ఒక్క ప్రభుత్వానికే లాభం చేకూరుతుందన్న భావనను విడిచిపెట్టాలని, సామాన్యుడు మొదలుకుని సంపన్నుడి వరకు ప్రయోజనం కలిగిస్తుందన్నారు. అడవుల విస్తీర్ణం ఎంత పెరిగితే ప్రకృతి వైఫరిత్యాలు అంత తగ్గుతాయన్నారు. గత యేడాది వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో హరితహారం కార్యక్రమం ఫలితాన్ని ఇవ్వలేదని, ఈ సారి వర్షాలు కురుస్తున్నందున మొక్కల పెంపకం కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. తాను వస్తున్నప్పుడు బంగ్ల వెంకటాపూర్ అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తే గత యేడాది నాటిన మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయని సంతృప్తిని వ్యక్తం చేసారు. సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామస్థులను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకుని చేయి చేయి కలిపితే సాధించని లక్ష్యం అంటూ లేదన్నారు. భవిషత్ తరాలకు ఉపయోగపడే విధంగా చెట్ల పెంపకం చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నాటించే మొక్కలు మంచి ఫలాలను అందిస్తాయని, తద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందన్నారు. సమాజానికి ఉపయోగపడే ఏ పనినైనా అందరు భాగస్వాములై కార్యాన్ని పూర్తి చేయాలని కోరారు. కొత్తగా ఇండ్లు నిర్మించుకునే వారికి మొక్కలు నాటితేనే అనుమతులిస్తారని, మొక్కలను పరిరక్షించి వాటిని సంరక్షించే వారికి తప్పని సరిగా రివార్డులతో సత్కరిస్తామన్నారు. మొక్కను నాటిన మొదటి యేడాది వరకు పుట్టిన శిశువును ఏలా పోషిస్తామో మొక్కను కూడా అదే స్థాయిలో కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వచ్చే ఆరు నెలల్లో మరోమారు సందర్శించి మొక్కల పెంపకాన్ని పరిశీలిస్తానని అన్నారు. మొక్కలను సంరక్షించడానికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తున్నట్లుగానే, ఎండిపోయిన మొక్కకు ఇంతంటూ పరిహారం చెల్లించడానికి సర్పంచులు సిద్దంగా ఉండాలని అంతకుముందు సిద్దిపేటలో ప్రజాప్రతినిధులను ఉద్దేశించి గవర్నర్ షరతు విధించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో సిఎంఓ ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్, కలెక్టర్ రొనాల్డ్ రోస్‌తో పాటు పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.