మెదక్

రైతుల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నకోడూరు, జూలై 19: మా భూములు సర్వే చేయకుండా అనంతగిరి ప్రాజెక్టు పనులు ఏలా చేస్తారని రైతులు రాస్తారోకో చేసిన సంఘటన మండలంలోని అల్లీపూర్ శివారులో మంగళవారం జరిగింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం అంతగిరికి చెందిన ప్రజలు, రైతులు చిన్నకోడూరు మండలం అల్లీపూర్ శివారులో జరుగుతున్న ఫ్రాజెక్టు పనులను అడ్డుకొని రోడ్డు పై బైఠాయించారు. మా భూములు సర్వే చేసి న్యాయం చేసేదాకా పనులు జరుగనీయమన్నారు. అనంతగిరి ఫ్రాజెక్టులో భూములు పోతున్న మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం వాసులకు సర్వే చేసి డబ్బులు అందించారన్నారు. మా గ్రామం పూర్తిగా ముంపుకు గురైతున్నా ఏ అధికారి ఇప్పటివరకు గ్రామసభలు, సమావేశాలు నిర్వహించి మాట్లాడలేదన్నారు. ప్రాజెక్టులో భూములు పోతున్న వారితో పాటు ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం ఏలాంటి పరిహారం అందిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో ఇండ్లు పోతున్న వారికి డబుల్ బెడ్‌రూం స్కీం వర్తింప చేసి మరోచోట గ్రామాన్ని నిర్మించాలన్నారు. ప్రాజెక్టులో భూములు పోతున్న వారికి 2013చట్టం ప్రకారం పరిహారం అందించాలన్నారు. ఈ విషయం పై పలుసార్లు మంత్రి హరీష్‌రావుకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తమతో మాట్లాడి సమస్య పరిష్కరించే దాకా ప్రాజెక్టు పనులు జరుగనీయమన్నారు.
విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సిఐ వెంకటయ్య, ఎస్‌ఐ సత్యనారాయణ అక్కడికి చేరుకొని వారిని సముదాయించినా ఆందోళన విరమించేది లేదని కలెక్టర్, ఆర్డీఓ వచ్చే వరకు రాస్తారోకో చేస్తామన్నారు. సిఐ వెంకటయ్య రైతులను సముదాయించి, వినతిపత్రం తీసుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. వారంలోపు సమస్య పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.