మెదక్

పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూలై 23: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని ఈ 12నుంచి 23వ తేదీ వరకు టిఎస్ ఆర్టీసీ మెదక్ రీజియన్ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్‌ఎం టి.రఘునాథ్‌రావు తెలిపారు. శనివారం ఆర్‌ఎం కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రతి రోజూ జిల్లాలోని అన్ని డిపోల నుంచి 70 బస్సులను నడపనున్నట్లు తెలిపారు. పుష్కరాలు పూర్తయ్యేంత వరకు మెదక్ రీజియన్ నుంచి మొత్తం 424 డీలక్స్, ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక బస్సులను బీచుపల్లి, వాడపల్లి, మట్టిపల్లి, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నడుపుతున్నామన్నారు. ఇందులో జిల్లాలోని ప్రధాన బస్‌స్టేషన్ల నుంచి 260 బస్సులు, పటాన్‌చెరు, లింగంపల్లి, బిహెచ్‌ఇఎల్, కూకట్‌పల్లి, హౌసింగ్‌బోర్డు, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల నుంచి మరో 164 ప్రత్యేక బస్సులను పుష్కరాలకు నడుపుతున్నట్లు వివరించారు. అదే విధంగా ఏ గ్రామం నుండైనా పుష్కరాలకు వెళ్లాలనుకుంటే 30మంది కంటే ఎక్కువ ప్రయాణికులు ఉంటే గ్రామానికి ప్రత్యేక బస్సును పంపించడం జరుగుతుందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్ధం అన్ని ప్రధాన బస్‌స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పుష్కర యాత్రికులు తమ టికెట్లను ఆన్‌లైన్‌లో డబ్లుడబ్లుడబ్లు. టిఎస్‌ఆర్‌టిసి ఆన్‌లైన్.ఇన్ వెబ్‌సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉంటే మరిన్ని అదనపు బస్సులను నడుపుతామన్నారు. విజయవాడ పుష్కరాలకు వెళ్లాలనుకునే వారికి కూడా సూపర్‌లక్జరీ బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. సమావేశంలో సిద్ధిపేట, జహీరాబాద్ డిఎంలు నరేష్, ఇసాక్, హజర్ హైమద్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.

ఎంపి పాటిల్‌ను నిలదీసిన అఖిలపక్షం
జహీరాబాద్, జూలై 23: హరితహారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపి బిబి.పాటిల్‌కు అఖిలపక్షం నాయకులు అడ్డుకున్నారు. రెవిన్యూ డివిజన్ ఏర్పాటుపై నిలదీశారు. అనంతరం రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకోసం వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉండగా జహీరాబాద్‌ను రెవిన్యూ డివిజన్ చేయడంపై వైఖరిని స్పష్టంచేయాలని ఎంపిని గట్టిగా నిలదీశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. జహీరాబాద్‌ను రెవిన్యూ డివిజన్ చేసేందుకోసం తానుకూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా శనివారం నాటితో రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేస్తున్న దీక్ష 30 రోజులైంది. శనివరం దీక్షలో వెల్‌ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు కూర్చున్నారు. కూర్చున్నవారిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సయ్యద్ కమాల్, ఎండి.వకీల్, ఫరీద్, కరీముద్ధీన్, షేక్ ఫరుూమ్, రాచయ్య, ముబీన్, యాసర్, ఇర్షాద్, ఎండి. రహీముద్ధీన్‌లున్నారు. టిడిపి ఇంచార్జి వై.నరోత్తం, బిజెపి నాయకులు రాచప్ప, సుధీర్ బండారిలు దీక్షలో కూర్చున్నవారికి పూలమాలలు అర్పించి ప్రారంభించారు. అనంతరం దీక్షనుద్దేశించి టిడిపి ఇంచార్జి వై.నరోత్తం మాట్లాడుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రెవిన్యూ డివిజన్ కోసం చేస్తున్న దీక్ష 30రోజులకు చేరుకున్నా ప్రభుత్వం ఇంతవరకు స్పందించక పోవడం సరికాదన్నారు. స్థానిక టిఆర్‌స్ నాయుకలు కూడా రెవిన్యూ డివిజన్ విషయమై నోరు మెదపక పోవడం సరికాదన్నారు. రెవిన్యూ డివిజన్ కావాలా? వద్దా? ప్రజలకు స్పష్టంచేయాలన్నారు. రెవిన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రేమ ఉంటే ఉద్యమ కారులతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. లేకుంటే జహీరాబాద్ ప్రజలు మిమ్మల్ని క్షమించరని స్పష్టంచేశారు. ఉద్యమం ఆగదని అందరి సహకారంతో వివిధ రూపాల్లొ ముందుకు తీసుకుని పోతామని స్పష్టంచేశారు. ఇప్పటినుంచి జహీరాబాద్ వచ్చిన మంత్రులను అడ్డుకుంటామన్నారు. జహీరాబాద్‌లో తిరగనిచ్చే ప్రసక్తిలేదని స్పష్టంచేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన వారిలో ఎంజి.నర్సిములు, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మాజిద్, గణేశ్, సిద్దు, శ్రీకంత్ తదితరులున్నారు.

పేటలో దొంగల స్వైర విహారం
* పదిళ్లలో చోరీ
రామాయంపేట, జూలై 23: రామాయంపేటలో మళ్లీ దొంగలు విజృంభించారు. తాళం వేసిన ఇళ్లు లక్ష్యంగా పేట్రేగుతున్నారు. పట్టణంలో సుమారు 10 ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. చుట్టుపక్కల గల తలుపులకు గడియవేసి మరీ చోరీలకు తెగబడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి నాటి దొంగల స్వైర విహారంతో స్థానికులు బెంబేలెత్తారు. వివరాల్లోకి వెళ్తే..దుర్గమ్మ బస్తీలోని వడ్ల పాండు ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లగా తాళం పగులగొట్టి ఇంట్లో గల తులం బంగారం, 10తులాల వెండి, 5వేల నగదు, ఉప్పరి బస్తీలోని లంబాడి గంగమ్మ ఇంట్లో నుంచి రూ.35వందల నగదు, 25తులాల వెండి గొలుసులు, అరతులం కమ్మలు, జలగడుగుల యాదగిరి ఇంట్లో నుంచి 21వేల నగదు, 5తులాల వెండి, అక్కల బస్తీలో నుంచి దుర్గం సాయిలు, సుదర్శన్‌లకు చెందిన రెండు ద్విచక్ర డిస్కవరి వాహనాలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. చల్మెడ ప్రభాకర్, చల్మెడ బ్రహ్మచారి, అంగన్‌వాడీ స్కూల్ తాళాలు పగులగొట్టారు. జయమ్మ ఇంట్లో జొరబడి బీరువా తాళాలు పగులగొట్టి వస్తువులను చిందరవందరగా పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాలకు వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. మెదక్ రాములు ఇంటి వద్ద గల సిసి కెమెరా ఫుటేజీలను ఎస్‌ఐ నాగార్జున్‌గౌడ్ పరిశీలించి..ఈ ముఠాలో ఐదుగురు దొంగలున్నట్లు అనుమానించారు. పోలీసులు కేసును దర్యాప్తును వేగవంతం చేసి దొంగలను పట్టుకొనే ప్రయత్నంలో మునిగారు.

ప్రభుత్వం దిగివచ్చేవరకూ ఉద్యమం

నర్సాపూర్ బంద్‌లో
డిసిసి అధ్యక్షురాలు సునీతారెడ్డి
నర్సాపూర్, శివ్వంపేట మండలాలను
సంగారెడ్డి జిల్లాలో కలపాలని డిమాండ్
నర్సాపూర్,జూలై 23: నర్సాపూర్, శివ్వంపేట మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలిపేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని డిసిసి అధ్యక్షురాలు, మాజీ మంత్రి వాకిటి సునీతారెడ్డి స్పష్టం చేశారు. శనివారంనాడు నర్సాపూర్ పట్టణ బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ
నర్సాపూర్ శివ్వంపేట మండలాల ప్రజల అభిప్రయాలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా ఏకపక్ష నిర్ణయాలతో వ్యవహరించడం సరైందికాదని అన్నారు. కెసిఆర్ నియంతృత్వ పోకడలకు స్వస్తీ పలకాలని లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని హితవు చెప్పారు. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన పునర్విభజన ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను కాదని ఏవరి ప్రయోజనాల కోసం మెదక్ జిల్లాలో నర్సాపూర్, శివ్వంపేట మండలాలను కలుపుతుందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్ మండలాన్ని అతిచేరువలో ఉన్న సంగారెడ్డి జిల్లాలో కలపకుండ 70కిలో మీటర్ల దూరంలోని మెదక్‌లో కలపడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. అఖిలపక్షం ఆద్వర్యంలో గత 34రోజులుగా నర్సాపూర్‌లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికి అధికార యంత్రాంగం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. 48గంటల బంద్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈసందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్త, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేశ్, ఎంపిటిసి సభ్యులు రాజేందర్, సురేష్, నర్సింలు, యాదగౌడ్, మాజీ ఎంపిపి లలిత, కాంగ్రెస్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

గత పాలకుల దిమ్మతిరిగేలా
అభివృద్ధి
* మంత్రి సహకారంతో ముందుకు
* ఎమ్మెల్యే బాబుమోహన్
పుల్కల్, జూలై 23: గత పాలకులకు దిమ్మతిరిగేలా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ అన్నారు. హరితహారంలో భాగంగా శనివారం మండలంలోని వెంకటకిష్టాపూర్, లింగంపల్లి మిషన్ కాకతీయ చెరువుగట్లపై మంత్రి హరీష్‌రావుతో కలిసి ఈత మొక్కలు నాటారు. అనంతరం మిషన్ భగీరథ పనులు, సింగూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం సింగూర్ కాల్వలకు 100 కోట్ల రూపాయలు కేటాయించుకొని ఆగమేఘాలపై పనులు నిర్వర్తించి ప్రజలను అయోమయానికి గురి చేశారన్నారు. కాల్వల పేరుతో లక్షల రూపాయాలు వెచ్చించి ప్రజాధనాన్ని వృదా చేశారన్నారు. కాల్వలకు సింగూర్ నీటిని ట్రాయల్ రన్‌గా విడిచినప్పుడే ఎక్కడికక్కడ పగిలిపోయి పంట పొలాల్లోకి ప్రవేశించినప్పుడే నాణ్యత ఏమిటో అర్థమైందన్నారు. కానీ మంత్రి హరీష్‌రావు చొరవ తీసుకొని కాల్వపనులపై దృష్టిపెట్టారన్నారు. దీంతో రాబోయే రోజుల్లో రైతులకు నీరాందించడమే కాకుండా మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎంపి మానిక్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ పద్మారావు, ఇఇ రాములు, డిప్యూటి ఇఇలు బాలగణేష్, జగన్నాథం, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు గోవర్ధన్, సిడిసి డైరెక్టర్ జైపాల్‌నాయక్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హరితహారం నిరంతర ప్రక్రియ

* మానవ మనుగడకు చెట్లే ఆధారం
* డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
రామాయంపేట, జూలై 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కల్వకుంట, నస్కల్ గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు చేపట్టిన ఈతవనం మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై మొక్కలను నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 8నుంచి 22వరకు చేపట్టిన హరితహారానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగిందన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మానవ మనుగడకు చెట్లే ఆధారమన్నారు. చెట్లతో వాతావరణ సమతుల్యం ఏర్పడి వర్షాలు పడుతాయని అన్నారు. మానవ సంపదను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. హరితహారం కార్యక్రమం దేశంలో మొదటిదన్నారు. భవిష్యత్ తరాలకు బంగారు తెలంగాణ సాధనలో భాగంగా మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కల్వకుంట ఎల్లమ్మ దేవాలయ సమీపంలో నాటే మొక్కలు చిన్నవిగా ఉండడంతో ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్ సైదులు, ఎంపిపి పుట్టి విజయలక్ష్మీ యాదగిరి, జడ్పీటిసి సభ్యురాలు బిజ్జ విజయలక్ష్మీ సంపత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ అందె కొండల్‌రెడ్డి, బాదె చంద్రం, సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు గన్నారం భవాని వెంకట్‌గౌడ్, మనె్న ప్రమీల జలెందర్, ఎంపిటిసిలు పావని, స్వామి, ఎర్రాగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రమేష్‌గౌడ్, సిద్దరాములు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా
భగీరథ పనులు
* కలెక్టర్ రోనాల్డ్ రోస్
కొండపాక, జూలై 23: రాజకీయాలకు అతీతంగా మిషన్ భగీరథ పనులు పూర్తి అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. హరితహారంలో భాగంగా శనివారం కొండపాకలో మొక్కలు నాటారు. అనంతరం భగీరథపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం గురించి ప్రపంచం బిత్తర పోతుందన్నారు. కనీవినీ ఎరుగనటువంటి కార్యక్రమం అన్నారు. ఆగస్టు 7తర్వాత నల్లాలేని ఇల్లు లేదనే మాట వినిపించవద్దని సూచించారు. అందరి సహకారంతో 6నెలల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. గోదావరీ నీళ్లు తెచ్చి ఇంచింటా నీళ్లు ఇవ్వడం మామూలు విషయం కాదన్నారు. ప్రజలు ఓట్లు వేస్తేనే మీరు గెలిచారని, సమస్యలను పైకి తేకుండా పరిష్కరించే విధంగా చూడాలని, అలా చేస్తేనే మీకు గౌరవం దక్కుతుందన్నారు. గజ్వేల్ నియోజకవర్గం చరిత్రలో నిలుస్తుందన్నారు. ప్రజల వద్ద డబ్బులు తీసుకోవద్దని, 10ఏళ్లు కాంట్రాక్టర్‌దే నిర్వహణ బాధ్యత ఉంటుందన్నారు. పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పద్మ, జడ్పిటిసి మాధురి, ఇడి సురేష్, ఎంపిడిఓ విజయ్‌భాస్కర్, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

లోకమాన్య తిలక్‌కు
ఘన నివాళి
రామాయంపేట, జూలై 23: లోకమాన్య తిలక్ జయంతి ఉత్సవాలను రామాయంపేటలో శనివారం ఘనంగా నిర్వహించారు. తిలక్ ఫ్రెండ్స్ యూత్ అధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా విహెచ్‌పి నేత సంగమేశ్వర్ మాట్లాడుతూ తిలక్ అడుగుజాడలో యువత నడువాలని సూచించారు. కేసరి పత్రిక ద్వారా భారతీయ స్వతంత్ర సంగ్రామంలో ప్రతి పౌరుడూ పాల్గొనేలా తిలక్ కృషి చేశాడన్నారు. గణపతి ఉత్సవాలను ప్రారంభించి యువతను దేశ ప్రగతిలో పాల్గొనేలా చేశాడన్నారు. ఈసందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి మొక్కలను నాటారు. ఈకార్యక్రమంలో తిలక్ యూత్ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
రోడ్లు ఊడ్చి ఎఎన్‌ఎంల నిరసన
దుబ్బాక, జూలై 23: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శనివారం 8వ రోజు దుబ్బాకలో రెండో ఏఎన్‌ఎంలు నిరసన చేపట్టారు. పట్టణంలోని రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. ఎన్నికల ముందు తమకిచ్చిన హామీలను నిలుపుకోవాలన్నారు. తమను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికీ హామీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను రెగ్యులరైజ్ చేస్త్తూ రూ.23,500 వేతనం అమలు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించే దాకా విధుల్లోకి చేరమన్నారు. ఇప్పటికైనా ఫ్రభుత్వం స్పందించి డిమాండ్లు పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తామన్నారు.

వన్య ప్రాణులను వేటాడితే
ఎంతటివారినైనా ఉపేక్షించం

వెల్దుర్తి, జూలై 23: జింకలను వేటాడి చంపి ఆటోలో తరలిస్తుండంగా పట్టుకున్న ఫారెస్టు అధికారులు ఎవరు అనేదానిపై విచారణను ముమ్మరం చేశామని మెదక్ డిఎఫ్‌ఓ శ్రీ్ధర్‌రావు అన్నారు. శనివారం వెల్దుర్తి మండలంలోని కళాన్‌శెట్టిపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. శెట్టిపల్లి గ్రామానికి చెందిన వారు ఈ జింకల వేటకు సంబందం ఏవరికైనా ఉన్నాదా అనేదానిపై గ్రామంలో విచారణ చేపట్టడం జరిగిందన్నారు. ఈ జింకల మాంసాన్ని ఎక్కడకు తరిలిస్తున్నారు. ఈ మాంసాన్ని వేటగాల్లు ఎక్కడ విక్రయించడానికి వెళ్తున్న సందర్భంలో తమ సిబ్బంది వారిని పట్టుకోవడం జరిగిందన్నారు. జింకలను చంపిన దృశ్యాలను చూస్తే రాటుతేలిన వేటగాళ్ల్లుగా ఉన్నారని తెలిపారు. జింకల మాంసాన్ని విక్రయించడానికా, వారు తినడానికే వేటాడారా అనే విషయంపై అన్నికోణాల్లో విచారిస్తున్నామన్నారు. అనుమానితులుగా ఇద్దరిని తమ కస్టడీలో ఉన్నారని తెలిపారు. వారి నుంచి ఎలాంటి సమాచారమూ లేదని ఇందులో పాత్రదారులు ఎంత మంది ఉన్నారో తేలాల్సిఉందన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారు ఎంతటివారైనా విడిచిపెట్టే ప్రసక్తిలేదని చట్టరీత్యా చర్యలు తప్పవని డిఎఫ్‌ఓ శ్రీ్ధర్‌రావు తెలిపారు. కళాన్‌శెట్టిపల్లికి మాజీ డిఎస్పీ హైదరాబాద్ నుంచి అటవీ ప్రాంతాన్ని ఎంచుకొని వేటకోసం వస్తున్నారని డిఎఫ్‌ఓ దృష్టికి తీసుకురాగా ఆయన స్పందిస్తూ తనకు ఎలాంటి సమాచారం లేదని, అలాంటి సమాచారం ప్రజలు అందించాలని, అటవీ ప్రాంతంలో జీవిస్తున్న పక్షులు, జింకలు తదితరాలను వేటాడానికి వచ్చే వారిని వదిలిపెట్టేది లేదన్నారు. అడవికి సంబందించిన విషయాలు గుర్తుతెలియని వ్యక్తులు వేటకువచ్చిన వారి సమాచారం తనకు చేరవేయాలని, అందుకు తన సెల్‌ఫోన్ నెంబర్‌ను పంచాయతీ కార్యాలయ గోడపై రాయంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోచారం రెన్‌జ్ అఫిసర్ బర్నోబా, మనోజ్‌కుమార్, శ్యామ్, అన్‌జార్, రాజమణిలతో పాటు ప్రజలు పాల్గ్గొన్నారు.